వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత వేలిముద్రల కేసు: హైకోర్టు ముందు హాజరైన ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వేలిముద్రల కేసులో ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శుక్రవారం మద్రాసు హైకోర్టు ముందు హాజరైనారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వేలిముద్రల కేసులో ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శుక్రవారం మద్రాసు హైకోర్టు ముందు హాజరైనారు. తమిళనాడులోని తిరుపురగుడ్రం శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికలు నిర్వహించే సమయంలో తాము తీసుకున్న నిర్ణయం విషయంలో ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది.

గత సంవత్సరం జయలలిత ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తమిళనాడులోని తిరుపురగుడ్రంతో సహ మరో నియోజక వర్గం, పుద్దుచ్చేరిలోని ఓ శాసన సభ నియోజక వర్గంలో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సందర్బంలో నామినేషన్ పత్రాల్లో జయలలిత వేలిముద్రలు వేసి వాటిని ఎన్నికల కమిషన్ అధికారులకు సమర్పించారు.

Election Comisison secretary appeared High Court Jayalalitha thumb impression case

తిరుపురగుడ్రం నుంచి అన్నాడీఎంకే పార్టీ నుంచి ఏకే. బోస్, డీఎంకే పార్టీ నుంచి డాక్టర్ శరవణ పోటీ చేశారు. తిరుపురగుడ్రం ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి ఏకే. బోస్ విజయం సాధించారు. నామినేషన్ పత్రాల్లో జయలలిత సంతకం లేకుండా వేలిముద్ర వేసి ఇచ్చారని, ఆ పత్రాలు, ఉప ఎన్నికలు చెల్లవని డీఎంకే ఆరోపించింది.

డీఎంకే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్ శరవణ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. జయలలిత వేలిముద్రల విషయంలో ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శుక్రవారం కోర్టు ముందు హాజరై వివరణ ఇచ్చారు.

English summary
Election commission principal secretary appeared in Madras highcourt for the case hearing of Jayalalitha thumb impression printed on Thiruparangundram bye election, case filed against it in HC by DMK candidate Saravanan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X