బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్..! రేపటి నుంచి 12 రాష్ట్రాల్లో-సీఈసీ షెడ్యూల్ ..!
బీహార్ లో ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ పూర్తయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెండో దశలో ఇదే ప్రక్రియ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇవాళ కీలక ప్రకటన చేసింది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఈ ప్రక్రియ వివరాలు వెల్లడించారు. రాజ్యాంగం ప్రకారం దేశంలో ఓటరుగా నమోదు అయ్యేందుకు నిబంధనలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ప్రతీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాల సవరణ అవసరం ఉందని ఆయన తెలిపారు.
బీహార్ లో ఇప్పటికే ఎస్ఐఆర్ ను విజయవంతంగా పూర్తి చేశామని, ఇప్పుడు అదే తరహాలో 12 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ చేపట్టబోతున్నట్లు సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. ఎస్ఐఆర్ కు సహకరించిన బీహార్ ఓటర్లకు శుభాకాంక్షలు తెలిపిన సీఈసీ.. ఇందులో పాల్గొన్న 7.5 కోట్ల మంది ఓటర్లకు నమస్కరించారు. ఎన్నికల కమిషన్ 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల అధికారులను కలుసుకుని ఈ ప్రక్రియ గురించి వివరంగా చర్చించినట్లు ఆయన తెలిపారు. రేపటి నుంచి ఓటర్ల జాబితాల సవరణ జరిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవులు, చండీఘర్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేస్, పశ్చిమబెంగాల్ ఉన్నాయి.

VIDEO | Delhi: Addressing a press conference, Chief Election Commissioner Gyanesh Kumar says, “...In the states where SIR will be conducted, electoral rolls will be frozen at midnight, today. Later, voters will be given unique enumeration forms with all details.”… pic.twitter.com/PxDkf7L2ri
— Press Trust of India (@PTI_News) October 27, 2025
ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ జరిగే 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇవాళ రాత్రి నుంచే ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల్ని నిలిపేస్తున్నట్లు సీఈసీ తెలిపారు.ఈ రాష్ట్రాల్లోని ఓటర్లు తరువాత ధృవీకరణ కోసం అన్ని సంబంధిత వివరాలను కలిగి ఉన్న ప్రత్యేక గణన ఫారమ్‌లను అందుకుంటారని తెలిపారు. అర్హులైన ప్రతీ ఓటరుకూ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ ఎస్ఐఆర్ చేపడుతున్నట్లు జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ జరిగే రాష్ట్రాల్లో ఎన్నికల అధికారులు ప్రతి ఇంటిని మూడుసార్లు సందర్శిస్తారని తెలిపారు. రేపటి నుంచి కింద బూత్ లెవల్ ఆఫీసర్లకు శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. ఓటరు వివరాలను ధృవీకరించడానికి , ఓటర్ల జాబితాల ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ప్రతి బీఎల్వో ప్రతి ఇంటిని మూడుసార్లు సందర్శిస్తారని వెల్లడించారు.

2003 ఓటరు జాబితాలో నమోదైన వాటితో సరిపోలిన పేర్లు లేదా వారి తల్లిదండ్రుల పేర్లు ఉన్న ఓటర్లు ఈ ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ తర్వాత కొత్త జాబితాలో చేర్చడానికి అదనపు పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. రెండో దశ ఎస్ఐఆర్ షెడ్యూల్ ప్రకారం ప్రింటింగ్, ట్రైనింగ్ కార్యక్రమాలు రేపటి నుంచి నవంబర్ 3 వరకూ జరుగుతుందన్నారు. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకూ ఇంటింటి సర్వే ఉంటుందన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ డిసెంబర్ 9 న ఉంటుందన్నారు. డిసెంబర్ 9 నుంచి జనవరి 8 వరకూ అభ్యంతరాల స్వీకరణ ఉంటుందన్నారు. డిసెంబర్ 9 నుంచి జనవరి 31 వరకూ ఓటర్లకు నోటీసుల జారీ ఉంటుందని, ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా ప్రచురణ ఉంటుందన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications