ఆంక్షలు కంటిన్యూ.. ర్యాలీ, సభలకు ఈసీ నో.. కానీ ఈ వెసులుబాట్లు

కరోనా వేళ ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఆంక్షలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. తొలుత ఈ నెల 15వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. దానిని పొడగిస్తూ వస్తున్నారు. ఆంక్షలను కొనసాగించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. ఐదు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ఎలా ఉంది ? వ్యాక్సినేషన్‌పై సీఈసీ సమీక్ష నిర్వహించారు. కరోనాతోపాటు..కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఈ నెల 31 వరకు ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం కొనసాగుతుందని సమావేశం తర్వాత సీఈసీ ప్రకటించారు.

ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోలపై మొదట జనవరి 15 వరకు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తర్వాత దీనిని జనవరి 22 వరకు పొడిగించారు. ఇంటింటి ప్రచారం కోసం ఐదుగురు వ్యక్తుల నుంచి 10 మందికి పెంచుతున్నట్లు, ఇందులో ఇతర సూచనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఫేజ్ 01 ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులను జనవరి 27న, ఫేజ్ 02లో పోటీ చేసే అభ్యర్థులను జనవరి 31వ తేదీలోపు ఖరారు చేసే అవకాశం ఉందని వెల్లడించింది.

Election Commission extends ban on rallies, road shows till January 31

భౌతిక సమావేశాలను గరిష్టంగా 500 మందితో జనవరి 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 08 వరకు (ఫేజ్ 1), ఫిబ్రవరి 01 నుంచి ఫిబ్రవరి 12 వరకు (ఫేజ్ 2) నిర్వహించుకోవచ్చని తెలిపింది. మరోవైపు దేశంలో కరోనా పంజా విసురుతూనే ఉంది. గత 24 గంటల్లో 3,37,704 కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. 2,42,676 మంది రికవరి చెందారు. 488 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

ఇటు ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్, గోవాలోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి జనవరి 21న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. జనవరి 28తో నామినేషన్లు ముగియనున్నాయి. జనవరి 30 వరకు విత్‌డ్రాకు అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 14న పోలింగ్ జరుగుతోంది. ఫలితాలను మాత్రం మార్చి 10న వెల్లడిస్తారు. పంజాబ్ పోలింగ్ ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం జరగనుంది. తొలుత 14వ తేదీ నిర్వహిస్తామని షెడ్యూల్‌లో ఈసీ తెలిపింది. మిగతా పక్షాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో 20వ తేదీన నిర్వహిస్తామని ఈసీ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+