అన్నాడీఎంకే పార్టీ పళనిసామి, పన్నీర్ దే, రెండాకుల చిహ్నం ఇచ్చిన ఈసీ, శశికళకు మరో షాక్ !
తమిళనాడు ప్రభుత్వానిదే అసలైన అన్నాడీఎంకే పార్టీ.పళనిసామి, పన్నీర్ సెల్వం చేతికి రెండాకుల చిహ్నం, పార్టీ జెండా.తమిళనాడులో సంబరాలు, శశికళకు మళ్లీ షాక్, టీటీవీ దినకరన్ వర్గీయులు మౌనం
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం తమిళనాడు ప్రభుత్వం చేతికి వెళ్లింది. ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గంలోని అన్నాడీఎంకే అసలైన పార్టీ అంటూ భారత ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ దెబ్బతో చిన్నమ్మ శశికళ వర్గం షాక్ కు గురైయ్యింది.
గురువారం న్యూఢిల్లీలోని భారత ఎన్నికల కమిషన్ ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీకే రెండాకుల చిహ్నం కేటాయిస్తున్నామని తేల్చి చెప్పింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గం నాయకులు, కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు.

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ జయలిత అభిమానులు, ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గం కార్యకర్తలు స్వీట్లు పంచిపెడుతున్నారు. బాణాసంచ కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. రెండాకుల చిహ్నం చెయ్యి జారిపోవడంతో శశికళ, టీటీవీ దినకరన్ వర్గీలు మౌనంగా ఇళ్లకే పరిమితం అయ్యారు. తమిళనాడులో ఇప్పుడు మళ్లీ రసవత్తర రాజకీయాలు మొదలైనాయి.












Click it and Unblock the Notifications