బిగ్ షాక్.. ఏపీలో 17, తెలంగాణలో 9 పార్టీల రద్దుకు ఈసీ చర్యలు..!

కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలి కాలంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల బీహార్ ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 65 లక్షలకు పైగా పేర్లు తొలగించింది ఈసీ. ఈ మేరకు ఆగస్టు 1న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేసింది. తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 30, 2025న ప్రచురించనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత గత ఆరేళ్లుగా ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయని 334 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ ను రద్దు చేస్తున్నట్లు ఈసీ అధికారికంగా ప్రకటించింది. తాజాగా మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల కమిషన్. దేశవ్యాప్తంగా మరో 476 పార్టీల రద్దుకు ఈసీ చర్యలు చేపట్టింది.

కేంద్ర ఎన్నికల సంఘం మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల దేశవ్యాప్తంగా 334 పార్టీలను రద్దు చేసింది ఈసీ. తాజాగా మరో 476 పార్టీల రద్దుకు చర్యలు చేపట్టింది. డీలిస్ట్‌ చేసేందుకు గుర్తించిన పార్టీల జాబితాలో ఏపీ నుంచి 17 పార్టీలు ఉన్నాయి. అలాగే తెలంగాణ నుంచి 9 పార్టీలు ఉన్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా జాబితాను విడుదల చేసింది.

Election Commission Moves to Dissolve 476 More Political Parties Including 26 from Telugu States

2019 నుంచి ఈసీ కొత్త నిబంధన పెట్టింది. ఆ రూల్ ప్రకారం ఒక్క ఎన్నికల్లోనైనా పోటీ చేయాలనే ముఖ్యమైన షరతును విధించింది. ఈ రూల్ విఫలమైన రిజిస్టర్డ్‌ గుర్తింపు లేని రాజకీయ పార్టీల ను గుర్తించి, జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు తాజాగా ఈసీ పేర్కొంది. ఈ మేరకు చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘిస్తున్న రాజకీయ పార్టీలపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+