Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అన్నాడీఎంకే పార్టీ: నేడే ఈసీ తీర్పు, పళని, పన్నీర్ వర్గాల్లో, చిన్నమ్మ వర్గంలో టెన్షన్ టెన్షన్?

న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం ఎవ్వరికి ఇవ్వాలనే విషయంపై నవంబర్ 23వ తేదీ గురువారం భారత ఎన్నికల కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటున్నది. అన్నాడీఎంకే పార్టీకి నిజమైన వారసులు ఎవరు ? అనే విషయం ఎన్నికల కమిషన్ ఈ రోజు తేల్చి చెప్పడానికి సిద్దం అయ్యింది.

అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయిన సందర్బంలో భారత ఎన్నికల కమిషన్ ఆ పార్టీ రెండాకుల చిహ్నాన్ని తాత్కలికంగా రద్దు చేసింది. అప్పటి నుంచి పన్నీర్ సెల్వం, శశికళ వర్గం భారత ఎన్నికల కమిషన్ ముందు వారి వాదనలు వినిపిస్తున్నారు. మూడు నెలల క్రితం పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళనిసామి వర్గాలు కలిసిపోయాయి.

Election Commission will deliver the verdict today the AIADMK's two leaves symbol case.

పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలు విలీనం అయిన తరువాత అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ, టీటీవీ దినకరన్ ను శాస్వతంగా బహిష్కరిస్తూ ఆ పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. అప్పటి నుంచి రెండాకుల చిహ్నం మాకే ఇవ్వాలని లేదు మాకే ఇవ్వాలని శశికళ వర్గం, తమిళనాడు ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ముందు వాదనలు వినిపిస్తోంది.

తమిళనాడు ప్రభుత్వం, శశికళ వర్గం వాదనలు వింటున్న భారత ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందని తెలిసింది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల కార్యదర్శులు ఎవరికి వైపు ఎక్కువ మంది ఉన్నారు అనే పూర్తి వివరాలు సేకరించిన భారత ఎన్నికల కమిషన్ ఈ రోజు తుది నిర్ణయం తీసుకోవాలని సిద్దం అయ్యింది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల చిహ్నం తమిళనాడు ప్రభుత్వానికి వెలుతుందా ? శశికళ వర్గానికి వెలుతుందా అంటూ ఇరు వర్గాల్లో టెన్షన్ మొదలైయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+