జైపూర్‌లో కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా బ్యాగు చోరీ

జైపూర్: కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా బ్యాగ్ దొంగతనానికి గురైంది. జైపూర్ విమానాశ్రయంలో ఆయన బ్యాగ్ మాయమైంది. రాజస్థాన్‌లో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకు ఈసీ బృందం జైపుర్‌కు వెళ్లింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ సహా ముగ్గురు కమిషనర్లు జయపురకు చేరుకున్నారు.

ఈ క్రమంలో విమానాశ్రయంలో సునీల్‌ అరోరా బ్యాగ్‌ దొంగతనానికి గురైంది. పోలీసులు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఈసీ బృందం రాజస్థాన్‌లో రెండు రోజులపాటు పర్యటిస్తోంది.

Election Commissioner Sunil Arora’s bag stolen at Jaipur Airport

కాగా, 2019లో జరుగనున్న లోకసభ ఎన్నికలకు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ట్రయలర్ లాంటివి అని బీజేపీ నేతలు చెబుతున్నారు. రాజస్థాన్‌లో బీజేపీని ఓడించే సత్తా ఎవరికీ లేదని, పార్టీ ఘన విజయం సాధించి తిరిగి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా గెలుస్తామని ధీమాతో ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయే మళ్లీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+