ఇంకా మోడీపై నమ్మకముంది: ట్విట్టర్ పోరు, ఓడిన ప్రముఖులు..
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ వర్గీయుల మధ్య ట్విట్టర్ యుద్ధం కొనసాగుతోంది! ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67, బీజేపీ 3 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అభిమానులు, వ్యతిరేకులు స్పందిస్తున్నారు.
ఢిల్లీ ఎన్నికల తర్వాత కూడా తనకు ప్రధాని మోడీ, అమిత్ షాల పైన నమ్మకం ఉందని, తర్వాత ఎన్నికలు బీహార్ అని సుప్రియాత్యాగి అని వ్యక్తి పేర్కొన్నారు. బీజేపీ తన కోర్ అజెండా నుండి తగ్గాలని లేదంటే మరిన్ని ఇలాంటి ఓటమిలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బిక్కీ బాక్సర్ అనే ట్వీటర్ యూజర్ పేర్కొన్నారు.

ఢిల్లీ ఎన్నికల్లో గెలుపొందిన, ఓడిన ప్రముఖులు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ప్రముఖుల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ (కృష్ణ నగర్), బీజేపీ సీనియర్ నేత జగదీష్ ముఖీ (జనక్‌పురి)లు ఉన్నారు. జగదీష్ ముఖీ ఏఏపీ అభ్యర్థి రాజేష్ రిషి చేతిలో ఓటమి చవి చూశారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అజయ్ మాకెన్ ఓడారు. విక్రమ్ బిదురి (తుగ్లక్‌బాద్), రంబీర్ సింగ్ బిదురి (బదర్పూర్)లు వంటి ముఖ్యులు ఓడారు.
కాంగ్రెస్ పార్టీ నుండి ఓడిన ప్రముఖుల్లో గతంలో ఎప్పుడూ ఓడని వారు కూడా ఉన్నారు. అందులో చౌధరీ మాతీన్ అహ్మద్ (శీలంపూర్), ప్రహ్లాద్ సింగ్ (చాందీనీచౌక్), హరూన్ యూసఫ్ (బల్లిమరన్), షోయబ్ ఇక్బాల్ (ఓక్లా)లు ఉన్నారు. కాంగ్రెస్ నేత కిరణ్ వాలియో ఓడిపోయారు. అరవింద్ కేజ్రీవాల్ చేతిలో బీజేపీ నేత నూపుర్ శర్మ ఓడారు.
ఏఏపీ నేత మనీష్ సిసోడియా(పత్పర్ గంజ్) గెలిచారు. రాష్ట్రపతి కుమార్తె షర్మిష్ట ముఖర్జీ ఓడిపోయారు. మాజీ కేంద్రమంత్రి కృష్ణతీర్థ్ భారీ మెజార్టీతో ఓడిపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేత సోమనాథ్ భారతి మాలవియ నుండి గెలుపొందారు.
Even after Delhi loss, I have full trust in Modi and Shah. Next fort is Bihar. They have been through worse periods than this. #DelhiDecides
— Supriya Tyagi (@SupriyaTyagi) February 10, 2015
No matter how much developmnt-2 Shri Modi will shout and work for it,majority Non-Hindus wouldn't support him. #SadTruth #DelhiDecides
— sreejith (@SreeINSearchhh) February 10, 2015 











Click it and Unblock the Notifications