"వన్ నేషన్.. వన్ ఎలక్షన్" పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర స్పందన!!

లోక్ సభ , రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయాన్ని పలు ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. జమిలి ఎన్నికలపై కేంద్రం నిర్ణయం వెనుక మతలబు ఏదో ఉందని అనుమానం వ్యక్తం చేశాయి. అయితే తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ "వన్ నేషన్ వన్ ఎలక్షన్" విధానంపైన స్పందించారు.

పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కేంద్రం యొక్క ఒకే దేశం ఒకే ఎన్నికల చర్యకు మద్దతును ప్రకటించారు. అయితే ఇది సరైన ఉద్దేశంతో చేస్తే దేశానికి ప్రయోజనకరంగా ఉంటుంది అని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. దీనిని మంచి ఉద్దేశంతో తీసుకువస్తే మంచిది అని పేర్కొన్న ఆయన భారత్ లాంటి అతిపెద్ద దేశాలలో సంవత్సరానికి 25 శాతం మంది ఎన్నికలకు ఓట్లు వేస్తూ ఉంటారన్నారు.

Election strategist Prashant Kishor

ఒకే ఎలక్షన్ విధానం తీసుకువస్తే ఇది ఒకటి రెండుసార్లు మాత్రమే పరిమితం అవుతుందని అది ఖర్చులను తగ్గించడంతో పాటుగా, ప్రజలు ఒకేసారి నిర్ణయం తీసుకోవలసిన విధంగా ఉంటుందని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు అసలు ఇది ఏ ఉద్దేశంతో తీసుకువస్తున్నారన్నదే ముఖ్యమని పేర్కొన్న ఆయన రాత్రికి రాత్రి పరివర్తన తీసుకురావాలని భావిస్తే సమస్యగా మారుతుందని, ప్రభుత్వం బిల్లు తీసుకువస్తుంది కాబట్టి, ఆ బిల్లును రానివ్వాలని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దేశానికి మేలు జరిగే విధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం ఉండాలని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1967 వరకు 18 సంవత్సరాల పాటు దేశంలో ఒకేసారి ఎన్నికలు ఎలా జరిగాయో ప్రశాంత్ కిషోర్ గుర్తు చేసుకున్నారు.

లోక్ సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు అనుకూలంగా పనిచేసే కారణాలను కూడా ఆయన వ్యక్తీకరించారు. ఓవైపు కొన్ని ప్రతిపక్షాలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని వివరంగా వ్యతిరేకిస్తున్న సమయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాత్రం వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానానికి మద్దతు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+