వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు నెలలకు గాను హర్యానాలో ఓ వ్యక్తికి రూ.1,776 కోట్ల కరెంట్ బిల్లు..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హర్యానాలో ఓ విద్యుత్ వినియోగదారుడికి ఊహించని షాక్ తగిలింది. అక్టోబర్, నవంబర్ రెండు నెలల్లో వచ్చిన బిల్లు చూసి అవాక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఫతేబాద్‌లోని రామ్‌నగర్ నివాసి అశోక్‌కుమార్‌కు రెండు నెలలకు ఏకంగా రూ.1,776 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది.

కరెంట్ బిల్లును సరిచేయాలని అధికారుల దగ్గరికి వెళ్తే వేధిస్తున్నారని అశోక్ కుమార్ ఆరోపించారు. కరెంట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సబ్ డివిజనల్ ఆఫీసర్ పీడీ శర్మ మాట్లాడుతూ దీనిని కంప్యూటర్ తప్పిదంగా పేర్కొన్నారు.

Electricity bill of Rs 1,776 crore shocks Haryana resident

ఇలాంటి కరెంట్ బిల్లులను వినియోగదారుడు పేమెంటే చేసే సందర్భంలో సరిచేస్తామని చెప్పారు. ఇటీవలే సోనే పట్ జిల్లాలోని గోహానాలో పట్టణంలో ఓ చిన్న పాన్ షాప్ నిర్వహిస్తున్న అతడికి రూ. 132.29 కోట్ల మేర విద్యుత్‌ను వాడుకున్నారని హర్యానా ఎలక్ట్రిసిటీ బోర్డు బిల్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ విద్యుత్ బిల్లుని ఉత్తర హర్యానా వితరణ్ నిగమ్ (UHBVN) నుంచి జారీ చేయబడింది. గతంలో కూడా హర్యానా ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ ఇలాంటి తప్పిదాన్నే చేసింది. 2007 ఏప్రిల్‌లో నార్నల్ పట్టణంలో ఓ వినియోగదారుడికి రూ.234 కోట్ల విద్యుత్ బిల్లుని జారీ చేసింది.

English summary
A power consumer here got the shock of his life when he got an electricity bill for an astronomical amount of over Rs 1,776 crore for October-November period.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X