బెంగళూరులో ఏనుగు దాడి: మహిళ మృతి
బెంగళూరు: ఏనుగు దాడి చెయ్యడంతో తీవ్రగాయాలైన మహిళ మరణించింది. మంగళవారం బెంగళూరు నగర శివార్లలోని బన్నేరుఘట్ట జాతీయ ఉద్యానవనం సమీపంలో ఐదు మంది కార్మికుల మీద ఏనుగు దాడి చేసింది. అందరిని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.
దాడి సమయంలో నాగమ్మ అనే మహిళ వెన్నెముక పూర్తిగా విరిగిపోయింది. చికిత్స విఫలమై నాగమ్మ అనే మహిళ బుధవారం మరణించిందని పోలీసులు చెప్పారు. మరో ఇద్దరు మహిళలు మృత్యువుతో పోరాడుతున్నారని వైద్యులు చెప్పారు.

బన్నేరుఘట్టలోని సఫారి రోడ్డులోని సిగేకట్టే దగ్గర నిత్యం ఏనుగులు దాడి చేస్తున్నాయని అటు వైపు సంచరించలేకపోతున్నామని ఏనుగు దాడిలో గాయపడిన మహేశ్వరమ్మ అనే మహిళ అన్నారు. నిత్యం అటు వైపు పలువురు కూలీలు సంచరిస్తుంటారు.
బన్నేరుఘట్ట లోని సఫారి రోడ్డు పనులు చెయ్యడానికి వెళ్లిన సమయంలో ఆహారం కోసం వచ్చిన ఏనుగు కూలీల మీద దాడి చెయ్యడంతో పనులు అర్దంతరంగా నిలిచిపోయాయి. పనులు చెయ్యడానికి ఎవ్వరు కూడా ముందుకు రావడం లేదు.












Click it and Unblock the Notifications