ఆలయ ఉత్సవాల్లో ఏనుగుల భీభత్సం.. ముగ్గురు మృతి, 50 మందికి గాయాలు
కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ లోని కోయిలాండిలో అపశృతి జరిగింది. కురువంగాడ్‌లోని మణికులంగర ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఉత్సవాల కోసం ఆలయానికి పీతాంబరన్ , గోకుల్ అనే రెండు ఏనుగులను తీసుకొచ్చారు. అయితే గురువారం రాత్రి ఉత్సవం జరగుతుండగా ఆలయ ఆవరణలోనే భక్తులు బాణాసంచా పేల్చారు. టపాసుల శబ్ధాలకు ఉత్సవాల కోసం తెచ్చిన ఏనుగులు బెదిరిపోయి జనంపైకి దూసుకొచ్చాయి.
ఏనుగుల నుంచి తప్పించుకునేందుకు ఉత్సవాలకు వచ్చిన భక్తులు పరుగులు పెట్టారు. ఈ క్రమంలోనే ఏనుగులు ముగ్గురు భక్తులను తొక్కుకుంటూ పోయాయి. దాంతో వారు మరణించగా.. తొక్కిసలాటలో మరో 30 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

మృతులను కురువంగాడ్‌లోని వెట్టంకందికి చెందిన లీల, వడక్కైల్‌కు చెందిన అమ్ముకుట్టి, రాజన్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు సైతం స్పందించారు. చనిపోయిన భక్తుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఇక ఏనుగులను సైతం కాపరులు అదుపులోకి తీసుకొచ్చారు.












Click it and Unblock the Notifications