Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'X' ఎక్స్ లో ఆ అకౌంట్లు నిలిపేయమన్న కేంద్రం - కుదరదన్న ఎలాన్ మస్క్...!

గతంలో కేంద్రానికీ, అమెరికాకు చెందిన సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కూడ మధ్య జరిగిన పోరు మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే అప్పట్లో కేంద్రానికీ, ట్విట్టర్ కూ వార్ జరగగా.. ఇప్పుడు ట్విట్టర్ స్ధానంలో ఎక్స్ గా మారిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కూ కేంద్రానికీ మధ్య పోరు సాగుతోంది. కొత్త ఐటీ నిబంధనల్ని తెరపైకి తెచ్చి సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై ఎక్స్ తో మరో పోరు నెలకొంది.

ఎక్స్ లో తాము కోరిన పోస్టుల్ని, ఖాతాల్ని బ్లాక్ చేయాలంటూ కేంద్రం తాజాగా జారీ చేసిన ఆదేశాల్ని ఆమలు చేసేందుకు ఎలాన్ మస్క్ సంస్ధ మరోసారి నిరాకరించింది. ఇది భావప్రకటనా స్వేచ్ఛకు విరుద్దమని, కేంద్రం ఆదేశాల అమలు న్యాయపరమైన చిక్కులకు దారి తీస్తుందని హెచ్చరించింది. అలాగే కేంద్రం తమకు ఇచ్చిన ఆదేశాల కాపీని సైతం ప్రచురించలేకపోతున్నట్లు ఎక్స్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. దీంతో కేంద్రం తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.

elon musk refuses centres order to withhold specific accounts on X

కేంద్రం ఆదేశాల అమలుకు నిరాకరిస్తూ ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ టీమ్ ఓ ట్వీట్ చేసింది. ఇందులో చట్టపరమైన పరిమితుల కారణంగా కేంద్రం యొక్క కార్యనిర్వాహక ఉత్తర్వులను ప్రచురించలేకపోతున్నామని తెలిపింది. అయితే"పారదర్శకత కోసం వాటిని పబ్లిక్ చేయడం చాలా అవసరం అని నమ్ముతున్నట్లు పేర్కొంది. దీంతో కేంద్రం ఆదేశాల అమలుకు తాము సిద్ధంగా లేమని తేల్చిచెప్పేసింది.

భారత ప్రభుత్వం X లో నిర్దిష్ట ఖాతాలు, పోస్ట్‌లపై చర్య తీసుకోవాల్సిందిగా కార్యనిర్వాహక ఆదేశాలు ఇచ్చిందని, వీటికి తగిన జరిమానాలు, జైలు శిక్షతో సహా పలు జరిమానాలు కూడా ఉంటాయని తెలిపినట్లు ఎక్స్ గ్లోబర్ గవర్నమెంట్ అఫైర్స్ టీమ్ తమ పోస్టులో వెల్లడించింది. దీనిపై తమ వైఖరికి అనుగుణంగా, భారత ప్రభుత్వం నిషేధించిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రిట్ అప్పీల్ పెండింగ్‌లో ఉందని, తమ విధానాలకు అనుగుణంగా ప్రభావితమైన వినియోగదారులకు ఈ చర్యల నోటీసు కూడా ఇచ్చినట్లు పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+