మోదీ ఫ్యాన్ నేను , ప్రధానితో మస్క్ సమావేశం - యూఎస్ లో యోగా ఉత్సవంలో..!!
ప్రధాని మోదీకి అమెరికాలో ఘన స్వాగతం లభించింది. న్యూయార్క్ లో ప్రధానికి భారత రాయబారి..ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ప్రధానితో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సమావేశమయ్యారు. తాను మోదీ ఫ్యాన్ అని మస్క్ పేర్కొన్నారు. పలువురు ప్రముఖులతో ప్రధాని సమావేశమయ్యారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ఐరాస ప్రధాన కార్యాయలంలో జరిగే యోగా ఉత్సవంలో ప్రధాని మోదీ పాల్గొంటున్నారు.
Prime Minister Narendra Modi met Tesla and SpaceX CEO Elon Musk, in New York. pic.twitter.com/saKdZwVWpE
— ANI (@ANI) June 21, 2023
అమెరికాలో ప్రధాని మోదీ:ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్న ప్రధాని మోదీ అమెరికా పర్యటన ప్రారంభమైంది. న్యూయార్క్ చేరుకున్న ప్రధానికి అక్కడ భారతీయ అధికారులు..ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. భారత్ మాతాకీ జై అంటూ పెద్ద ఎత్తున భారతీయ జెండాలతో ప్రవాస భారతీయులు స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు.

అమెరికా అధ్యక్షడు బైడెన్..ప్రధమ మహిళ జిల్ బైడెన్ ల ప్రత్యేక అధికారిక ఆహ్వానం రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య విలువైన బంధానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుందని ప్రధాని మోదీ అమెరికా ప్రయాణానికి ముందు ట్వీట్ చేసారు. తాను జరిపే చర్చలు రెండు దేశాల మధ్య పరస్పర సహకరానికి దోహదం చేయటంతో పాటుగా జీ-20, క్వాడ్,ఐపీఈఎఫ్ వంటి వేదికలపైన కలిసి పని చేయటానికి ఉపయోగపడతాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ సారి భేటీని మరింత బలోపేతానికి వచ్చిన అవకాశంగా ప్రధాని పేర్కొన్నారు.
సమావేశమైన ఎలాన్ మస్క్:న్యూయార్క్ చేరుకున్న ప్రధానితో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సమావేశయ్యారు. తాను ప్రధాని మోదీ ఫ్యాన అని మస్క్ చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది భారత్ లో పర్యటనకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నట్లు మస్క్ వెల్లడించారు. ఏపీలో వ్యాపర విస్తరణ..పెట్టుబడుల పైన మస్క్ ఆసక్తిగా ఉన్నట్లు వివరించారు.
#WATCH | Indian community welcomes Prime Minister Narendra Modi as he arrives at Lotte New York Palace. pic.twitter.com/cZHTsP8Q7q
— ANI (@ANI) June 20, 2023
ప్రధానితో జరిగిన సమావేశంపైన సంతోషం వ్యక్తం చేసారు. ఆ తరువాత ప్రధాని మోదీ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ డి గ్రాస్, నోబెల్ బహుమతి గ్రహీత పాల్ రోమెర్ తో ప్రధాని సమావేశమయ్యారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సమయంలో అధ్యక్షుడ బైడెన్ - జిల్ బైడెన్ వైట్ హౌస్ లో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసారు. ఈ విందు భేటీ పైన ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు.
యోగా వేడుకల్లో ప్రధాని:ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే చరిత్రాత్మక యోగా దినోత్సవం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరగనుంది. 2014లో జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించారు. ఆ తరువాత జరుగుతున్న 9వ ఉత్సవం ఇదే. ఈ సారి ఐరాసలో అధికారికంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవంలో ప్రధాని మోదీ పాల్గొంటుడటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పలు దేశాల రాయబారులు..అధికారులు..
పలువురు ప్రముఖుల హాజరు కానున్నారు. 180 దేశాలకు చెందిన ప్రతినిధులు యోగా దినోత్సవంలో పాల్గొంటారు. మోదీతో కలిసి యోగా దినోత్సవంలో పాల్గొనటం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఐరాస సాధారణ సభ 77వ సెషన్ అధ్యక్షుడు సాబా కొరొసి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications