వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కావాల్సింది బుల్లెట్ రైలు కాదు': ముంబై ప్రమాదంపై షాకింగ్ నిజాలు

ముంబైలోని ఎల్పిన్‌స్టోన్ రైల్వే స్టేషన్ ప్రమాదంపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం స్పందించారు. ఇది మానవ తప్పిదమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆమె తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

|
Google Oneindia TeluguNews

ముంబై: ముంబైలోని ఎల్పిన్‌స్టోన్ రైల్వే స్టేషన్ ప్రమాదంపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం స్పందించారు. ఇది మానవ తప్పిదమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆమె తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

రైల్వేల భద్రత బాగా లేదన్న సోనియా గాంధీ

రైల్వేల భద్రత బాగా లేదన్న సోనియా గాంధీ

క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వేల భద్రత ఏం బాగోలేద‌న్నారు. ప్రయాణికుల భద్రతకు సరైన ప్రణాళిక ఉంటే ఇటువంటి ఘ‌ట‌న‌లు జరగవన్నారు. క్ష‌త‌గాత్రుల‌కు సంబంధిత అధికారులు వైద్య సదుపాయం అందేలా చూడాల‌న్నారు.

బుల్లెట్ రైలు కాదు, తొలుత ప్రయాణీకుల సేఫ్టీ

బుల్లెట్ రైలు కాదు, తొలుత ప్రయాణీకుల సేఫ్టీ

ప్రజలు ఖరీదైన బుల్లెట్‌ రైళ్లను కోరుకోవడం లేదని, ప్రతి రోజు ఉపయోగించే వంతెనలను బాగు చేయించండి చాలునని, అలాగే రైలు ప్రమాదాలను చోటు చేసుకోకుండా చూడాలని తొక్కిసలాటలో గాయపడిన పలువురు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

షాకింగ్ విషయాలు చాన్నాళ్లుగా ఫిర్యాదులు

షాకింగ్ విషయాలు చాన్నాళ్లుగా ఫిర్యాదులు

ప్రమాదం అనంతరం షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి.
ఎల్ఫిన్‌స్టోన్స్‌ రైల్వే స్టేషన్‌ అధ్వాన స్థితిలో ఉందని, ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయని గత కొన్నేళ్లుగా నెటిజన్లు అధికారులను హెచ్చరిస్తూనే వస్తున్నారు. ఏదో ఒక ప్రమాదం జరిగేంత వరకు ఎదురు చూడొద్దని, వెంటనే వంతెనను వెడల్పు చేయాల్సిందిగా ఫిర్యాదులు చేశారు.

అధికారులపై ఆగ్రహం

అధికారులపై ఆగ్రహం

కానీ, అధికారులు మాత్రం ఏమాత్రం స్పందించలేదు. దీంతో ఘోరం జరిగింది. అలసత్వం కారణంగా శుక్రవారం తొక్కిసలాట జరిగి 22 మంది మృతి చెందారు. ఫిర్యాదులు వచ్చినప్పుడే అధికారులు స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని నెటిజన్లు అధికారులపై మండిపడుతున్నారు.

ప్రభు, మోడీలను జత చేస్తూ

ప్రభు, మోడీలను జత చేస్తూ

మాజీ రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు, ప్రధాని నరేంద్ర మోడీ ట్విటర్‌ ఖాతాలను జత చేస్తూ పలువురు నెటిజన్లు ఎల్ఫిన్‌స్టోన్స్‌ రైల్వే స్టేషన్‌ తీరు గురించి గతంలో ఫిర్యాదులు చేశారు. వంతెన కూలిపోయేలా ఉందని, రద్దీగా ఉండే సమయాల్లో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.

నిధులు మంజూరు చేసిన రైల్వే మంత్రి

నిధులు మంజూరు చేసిన రైల్వే మంత్రి

ఈ వంతెన గురించి 2016 ఫిబ్రవరిలో శివసేన పార్లమెంటేరియన్‌ అరవింద్‌ సావంత్‌ సురేశ్‌ నాటి కేంద్ర రైల్వే మంత్రికి లేఖ రాశారు. పైవంతెనకు మరమ్మత్తులు చేయించాల్సిందిగా కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి ఇందుకోసం రూ.9.5 కోట్లు మంజూరు చేశారు. కానీ అధికారుల అలసత్వం 22 మందిని బలితీసుకుంది.

English summary
Terming death of 22 persons in a stampede at rail foot-over-bridge in Mumbai a "man-made" disaster, Congress chief Sonia Gandhi said the incident could have been avoided by taking care of the safety aspect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X