వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖాళీ ఆక్సిజన్ సిలిండర్లు... భారీ క్యూ లైన్లు... నిండిపోయిన శ్మశానాలు... యూపీలో ఇదీ పరిస్థితి...

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది... ఏ ఆస్పత్రి చూసినా పేషెంట్లతో కిక్కిరిసిపోయి కనిపిస్తోంది... బెడ్లు దొరక్క,ఆక్సిజన్ అందక అల్లాడిపోతున్నారు..మహారాష్ట్ర,ఢిల్లీ,ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నో ఆస్పత్రుల ముందు జనం ఆక్సిజన్ సిలిండర్లతో బారులు తీరారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి...

Recommended Video

Oxygen Crisis : Centre Exempts Customs Duty on Vaccines, Oxygen For 3 Months || Oneindia Telugu
ఆక్సిజన్ సిలిండర్లతో బారులు...

ఆక్సిజన్ సిలిండర్లతో బారులు...

లక్నోలోని మెడికల్ ఆక్సిజన్ సెంటర్ ముందు కోవిడ్ పేషెంట్ల కుటుంబ సభ్యులు ఇలా ఆక్సిజన్ సిలిండర్లతో బారులు తీరారు..(Image : PTI)

ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్...

ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్...

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఏ ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రిలోనూ ఆక్సిజన్ కొరత లేదన్నారు. అయితే బ్లాక్ మార్కెట్‌తోనే కొంత సమస్య తలెత్తుతోందని చెప్పారు. బ్లాక్ దందా చేసేవారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఫోటోలో యూపీలోని కాన్పూర్ ఆక్సిజన్ ఫిల్లింగ్ సెంటర్ వద్ద కనిపించిన దృశ్యం.. (Image : PTI)

ఆస్పత్రుల్లో పడకల కొరత

ఆస్పత్రుల్లో పడకల కొరత

కాన్పూర్‌లోని ఎల్ఎల్ఆర్ ఆస్పత్రిలో బెడ్ల కొరత నెలకొంది. దీంతో ఓ పేషెంట్ ఇలా ఆస్పత్రి బయటే నిరీక్షించాల్సి వస్తోంది. (Image : PTI)

రోధిస్తున్న కుటుంబ సభ్యురాలు

రోధిస్తున్న కుటుంబ సభ్యురాలు

కాన్పూర్‌లోని ఉర్సులా ఆస్పత్రిలో మృతి చెందిన కోవిడ్ పేషెంట్... రోధిస్తున్న కుటుంబ సభ్యురాలిని ఓదారుస్తున్న బంధువులు... (Image : PTI)

సామూహిక దహన సంస్కారాలు

సామూహిక దహన సంస్కారాలు

కాన్పూర్‌లోని భైరవ్ ఘాట్ హిందూ శ్మశానంలో కోవిడ్ బాధితుల మృతదేహాలకు సామూహిక దహన సంస్కారాలు... (Image : PTI)

కోవిడ్ బాధితుల మృతదేహాలు

కోవిడ్ బాధితుల మృతదేహాలు

కాన్పూర్‌లోని ఓ క్రిమేటోరియం వద్ద కోవిడ్ బాధితుల మృతదేహాలు... (Image : PTI)

లక్నో రైల్వే స్టేషన్

లక్నో రైల్వే స్టేషన్

లక్నో రైల్వే స్టేషన్‌లో రైలు వ్యాగన్‌పై ఖాళీ ట్యాంకర్ వాహనాలు. బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి ఈ ట్యాంకర్ల ద్వారా లక్నోకి ఆక్సిజన్ తరలించనున్నారు. (Image : PTI)

ఆక్సిజన్ ఫిల్లింగ్ సెంటర్

ఆక్సిజన్ ఫిల్లింగ్ సెంటర్

లక్నోలోని ఆక్సిజన్ ఫిల్లింగ్ సెంటర్ వద్ద కోవిడ్ పేషెంట్ల కుటుంబ సభ్యులు,బంధువులు.. తమవంతు కోసం ఎదురుచూస్తూ ఇలా క్యూ లైన్‌లో నిలబడ్డారు.

English summary
Uttar Pradesh Chief Minister Yogi Adityanath spoke on the oxygen crisis issue and said that there is no shortage of oxygen in any COVID hospital, be it private or government. Yogi Adityanath also said that the problem is black marketing and hoarding, which will be tackled with a heavy hand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X