విధుల్లో తిరిగి చేరిన 'ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్' దయానాయక్
ముంబై: ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరుగాంచిన దయా నాయక్ సోమవారం తిరిగి విధుల్లోకి చేరాడని ముంబై పోలీసు డిపార్ట్‌మెంట్ వర్గాల సమాచారం. 1995 బ్యాచ్‌కు చెందిన దయా నాయక్‌పై 2006లో ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని ఆయన ఇంటిపై దాడి చేసి అరెస్ట్ చేసింది.
దీంతో అతడిపై సస్పెన్షన్ వేటు పడింది. 2010లో అతడిపై కేసును సుప్రీం కోర్టు కోట్టవేసింది. దీంతో తిరిగి మళ్లీ జూన్, 2012లో పోలీసు శాఖలోని లోకల్ ఆర్మ్ విభాగంలో విధుల్లోకి చేరాలని పోలీసు శాఖ ఆదేశించింది. పోలీసు శాఖలో బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజులకు అతడిని బాంద్రా నుంచి అంథేరికి బదిలీ చేశారు.

ఆ తర్వాత మళ్లీ అతడిని గతేడాది నాగ్‌పూర్ ప్రాంతానికి బదిలీ చేశారు. అయితే నాగ్‌పూర్‌లో ఉద్యోగం చేయడం ఇష్టం లేని దయా నాయక్ ఏడాది పాటు అనారొగ్యపు సెలవు కోసం అప్లై చేశాడు. దీంతో అతడిని మళ్లీ సస్పెండ్ చేశారు. అలా 6 సంవత్సరాల పాటు సస్పెన్షన్‌కు గురైన దయా నాయక్ తిరిగి మళ్లీ సోమవారం విధుల్లో చేరారు.
కాగా దయా నాయక్ విషయానికి వస్తే ముంబైలో 83 ఎన్‌కౌంటర్లు చేశారు. అందులో ముగ్గురు దావూద్ గ్యాంగ్‌కు వ్యక్తులు ఉండటం విశేషం. ముంబై నుంచి మాఫియాను ఏరివేయడానికి ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం దయా నాయక్ వయసు 48 సంవత్సరాలు. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో కార్కాలా తాలుకాలోని యెన్నెహోల్ గ్రామంలోని జన్మించారు. మాతృభాష కొంకణి.












Click it and Unblock the Notifications