Encounter: సిక్కుల నకిలి ఎన్ కౌంటర్, 43 మంది పోలీసులకు 7 ఏళ్లు జైలు శిక్ష, కోర్టు సంచలన తీర్పు !

లక్నో/ఉత్తరప్రదేశ్: విలాసవంతమైన బస్సులో చాలా మంది యాత్రికులు బయలుదేరారు. మార్గం మద్యలో పోలీసులు బస్సు నిలిపి 10మందిని కిందకు దించి వేరే వాహనంలో పిలుచుకుని వెళ్లారు. 10 మందిని మూడు గ్రూపులుగా చేసి ఎన్ కౌంటర్ చేశారు. అదే రోజు 10 మంది శవాలకు పోస్టుమార్టుం చేశారు. మరుసటి రోజు మేము ఖలిస్తాన్ ఉగ్రవాదులను చంపేశామని పోలీసులు ప్రకటించారు. అయితే పోలీసులు అవార్డులు, రివార్డుల కోసం అమాయకులైన సిక్కులను చంపేశారని సీబీఐ కోర్టు చెప్పింది. అమాయకులైన సిక్కులను నకిలి ఎన్ కౌంటర్ చేసిన 43 మంది పోలీసులకు 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు సంచనల తీర్పు చెప్పింది. ఈ కేసులో రిటైడ్ అయన పోలీసు అధికారులు ఎక్కడెక్కడ ఉన్నారు అంటూ పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

ఆరోజు ఏం జరిగిందంటే ?

ఆరోజు ఏం జరిగిందంటే ?

1991లో జులై 12వ తేదీన సిక్కులు విలాసవంతమైన బస్సులో ఫిల్బిత్ కు యాత్రికులు బయలుదేరారు. మార్గం మద్యలో కచ్లాఫుల్ ఘాట్ మీపంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు పోలీసులు సిక్కులు వెలుతున్న బస్సు నిలిపి 10మంది సిక్కులను కిందకు దించి పోలీసుల వాహనంలో పిలుచుకుని వెళ్లారు. 10 మంది సిక్కులను మూడు గ్రూపులుగా చేసిన ఉత్తరప్రదేశ్ పోలీసులు అదే రోజు ఎన్ కౌంటర్ చేశారు.

ఉగ్రవాదులు అని చెప్పిన పోలీసులు

ఉగ్రవాదులు అని చెప్పిన పోలీసులు

అదే రోజు 10 మంది సిక్కుల శవాలకు పోస్టుమార్టుం చేశారు. మరుసటి రోజు మేము ఖలిస్తాన్ ఉగ్రవాదులను చంపేశామని ఉత్తరప్రదేశ్ పోలీసులు మీడియా ముందు గొప్పలు చెప్పుకున్నారు. అయితే అమాయకులైన సిక్కులను కాల్చి చంపేశారని దూమరం రేపింది. ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎన్ కౌంటర్ పై విచారణ జరిపించాలని సుప్రీం కోర్టు సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.

సీబీఐ కోర్టులో విచారణ

సీబీఐ కోర్టులో విచారణ

సీబీఐ విచారణలో ఉత్తరప్రదేశ్ పోలీసులు నకిలి ఎన్ కౌంటర్ చేశారని వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు అవార్డులు, రివార్డుల కోసం అమాయకులైన సిక్కులను చంపేశారని సీబీఐ తన నివేదికను సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు సమర్పించింది. 47 మంది పోలీసు అధికారులు, పోలీసుల మీద ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.

43 మంది పోలీసులకు 7 ఏళ్లు జైలుశిక్ష

43 మంది పోలీసులకు 7 ఏళ్లు జైలుశిక్ష

అలహాబాద్ హైకోర్టులోని లక్నో ప్రత్యేక బెంచ్ లో కేసు విచారణ జరిగింది. అమాయకులైన సిక్కులను అమానుషంగా ఎన్ కౌంటర్ చేసిన 43 మంది పోలీసులకు ప్రత్యేక కోర్టు 7 సంవత్సరాల కఠినకారాగార శిక్ష విధించింది. నిందితులు చిక్కితే వారిని పోలీసులు విచారణకు తీసుకురావాలని, చేతిలో ఆయుధాలు ఉన్నాయని వారిని ఎన్ కౌంటర్ చెయ్యకూడదని, ఇది హత్య కంటే ప్రమాదకరం అని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

కోర్టు సంచలన తీర్పు

కోర్టు సంచలన తీర్పు

అమాయకులైన సిక్కులను ఎన్ కౌంటర్ చేసిన వారిలో ఇప్పటికే కొందరు పోలీసులు చనిపోగా మరికొందరు రిటైడ్ అయ్యారు. మొత్తం మీద కోర్టు ముందు అందరూ సమానమే అని మరోసారి రుజువు అయ్యింది, మాకు ఇంతకాలానికి న్యాయం జరిగిందని ఉత్తరప్రదేశ్ లో హత్యకు గురైన సిక్కుల కుటుంబ సభ్యులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+