రూ.870 కోట్లు లంచం: మాజీ మంత్రి అరెస్టు
ముంబై: వివిధ శాఖల ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు అప్పగించినందుకు భారీ మొత్తంలో లంచాలు తీసుకున్న ఆరోపణలతో మహారాష్ర్ట మాజీ మంత్రి, ఎన్ సీపీ నేత ఛగన్ భుజ్ బల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
ఢిల్లీలోని మహారాష్ర్ట సదన్ నిర్మాణంతో సహ పలు కాంట్రాక్టులు ఇచ్చినందుకు ఛగన్ భుజ్ బల్ దాదాపు రూ. 870 కోట్లు లంచాల రూపంలో తీసుకున్నారని ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తంలో కొంత భాగం నగదు విదేశాలకు తరలించారని, తరువాత భూటకపు కంపెనీల పేరుతో నిధులు వెనక్కి తెప్పించారని అధికారులు అంటున్నారు.

ఈ భూటకపు కంపెనీల్లో ఒకటైన ఆర్మ్ స్ర్టాంగ్ ఎనర్జీ సంస్థ యజమానులు భుజ్ బల్ కుటుంబ సభ్యులేనని, ఈ కంపెనీ పై కూడా దర్యాప్తు చేస్తున్నామని ఈడీ అధికారులు అంటున్నారు. మనీ లాండరింగ్ చట్టం కింద భుజ్ బల్ తో పాటు కొందరి మీద కేసులు నమోదు అయ్యాయి.
మంగళవారం నాసిక్, ముంబై, థానే లోని భుజ్ బల్, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లపై దాడులు చేసిన అధికారులు సోదాలు చేస్తున్నారు. భుజ్ బల్ ను ఈడీ కార్యాలయానికి తీసుకు వెళ్లి ఆయనను ప్రశ్నించారు. అయితే భుజ్ బల్ కు ఎలాంటి కుంభకోణాలతో సంబంధం లేదని, రాజకీయ కుట్రతో ఆయనను అరెస్టు చేశారని ఎన్ సీపీ వర్గాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications