అమెరికా నుంచి తిరిగొస్తున్న వారికి కేంద్రం భారీ షాక్..!

అమెరికాలో గత కొన్నేళ్లుగా అక్రమంగా వలసవెళ్లి పాగా వేసిన భారతీయుల్ని గుర్తించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి పంపేస్తున్నారు. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపాలన్న నిర్ణయం మేరకు వీరిని మిలటరీ విమానాల్లో ఎక్కించి మరీ భారత్ కు పార్శిల్ చేసేస్తున్నారు. ఇక్కడకు కాళ్లకు గొలుసులతో వస్తున్న వారిని చూసి తోటి భారతీయులు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై పార్లమెంట్ లోనూ రచ్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం చెప్పిన ఓ పాయింట్ ఇప్పుడు ఇలా భారత్ కు తిరిగొస్తున్న వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

అసలే లక్షలు తగలేసి అమెరికాకు అక్రమ మార్గాల్లో వెళ్లి సెటిల్ అవుదామనుకుంటే అక్కడ ట్రంప్ ఉరుముతున్నాడు. అలాగని ట్రంప్ చేతికి చిక్కి భారత్ కు తిరిగొస్తున్న వారికి ఇక్కడి ప్రభుత్వం షాకిస్తోంది. ఇప్పటికే అమెరికాకు ఇలా అక్రమ మార్గాల్లో వెళ్లిన వారి వివరాలను సేకరిస్తోంది. తాజాగా అమెరికా నుంచి తిరిగి వచ్చిన వారి సాయంతో ఇలా ఇంకెంత మంది వెళ్లారో తెలుసుకునేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకూ ఓ నాలుగు వేల మంది లెక్క తేలగా.. మిగిలిన వారిని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Enforcement directorate inquiry threat to Indian immigrants deported by US government

2021 నుంచి 2024 వరకూ అంటే బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమెరికాకు భారత్ నుంచి వలస వెళ్లిన 4300 మందిని ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. గుజరాత్, పంజాబ్ కేంద్రంగా ఉన్న ఏజెంట్ల సాయంతో వీరు అమెరికాకు అక్రమ మార్గాల్లో వెళ్లినట్లు సమాచారం. అలాగే వీరంతా భారతీయుల్ని అమెరికాకు పంపడానికి అక్రమ మార్గాలను రూపొందించినట్లు కనుగొన్నారు. ఇలా వీరు చేసిన 4,000కు పైగా అనుమానాస్పద లావాదేవీలను గుర్తించారు. అలాగే వీరు భారతీయుల్ని అమెరికాతో పాటు చట్ట విరుద్దంగా కెనడాకూ పంపినట్లు గుర్తించారు. దీంతో వీరిని అరెస్టు చేసి ప్రశ్నించేందుకు ఈడీ సిద్దమవుతోంది.

అక్రమ వలసలను సులభతరం చేయడానికి ఏజెంట్లు విద్యా వ్యవస్థలోని లొసుగులను ఉపయోగించుకుంటున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. అమెరికాకు వెళ్లాలనుకునే చాలా మంది భారతీయులకు కెనడియన్ కాలేజీల్లో మోసపూరిత అడ్మిషన్లు ఇస్తున్నట్లు సమాచారం అందింది. ఈ తప్పుడు ప్రవేశాల ఆధారంగా వ్యక్తులకు కెనడియన్ విద్యార్థి వీసాలు జారీ చేస్తున్నట్లు గుర్తించారు. కెనడాకు చేరుకున్న తర్వాత విద్యార్థులు వారి సంబంధిత కళాశాలలకు హాజరు కాలేదని కూడా తేలింది. అయితే వీరంతా కెనడాలోని తమ సహచరుల ద్వారా సరిహద్దుల గుండా అమెరికాలోకి అక్రమంగా రవాణా అవుతున్నట్లు తేల్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+