Engineer: మేస్త్రీ భార్యతో మస్త్ మజా చేసిన ఇంజనీరు, కోసి కారం పెట్టిన బ్రదర్స్, పెళ్లికి పిలిస్తే !

ముంబాయి: ప్రముఖ డెవలపర్స్ సంస్థలో ఓ యువకుడు సివిల్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇదే సంస్థలో చాలా మంది మేస్త్రీలు, కూలీలు భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న భవనంలో సివిల్ ఇంజనీరు, ఇద్దరు సోదరులు పని చేస్తుండటంతో వారికి పరిచయం అయ్యింది. చాలాకాలం నుంచి సోదరులు ఆ సివిల్ ఇంజనీరు దగ్గర పని చేస్తున్నారు. సోదరుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో సివిల్ ఇంజనీరును ఆహ్వానించారు. శుభకార్యానికి వెళ్లిన సివిల్ ఇంజనీరు అక్కడే మేస్త్రీ భార్యతో కలిసి ఓ ఘనకార్యం చేశాడు. కొంతకాలం ఈ స్టోరీ జరిగింది. తరువాత సోదరులు మరో స్నేహితుడితో కలిసి పక్కాప్లాన్ తో సివిల్ ఇంజనీరును దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

 సివిల్ ఇంజనీరు

సివిల్ ఇంజనీరు

ముంబాయిలోని వాషి ఏరియాలో సూరజ్ పటాయిత్ అలియాస్ సూరజ్ (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ముంబాయిలోని ప్రముఖ డెవలపర్స్ సంస్థలో సూరజ్ సివిల్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇదే సంస్థలో చాలా మంది మేస్త్రీలు, కూలీలు భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు.

 ఇంజనీరుతో క్లోజ్ గా ఉంటున్న బ్రదర్స్

ఇంజనీరుతో క్లోజ్ గా ఉంటున్న బ్రదర్స్

భాండూప్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న భవనంలో సివిల్ ఇంజనీరు సూరజ్ తో పాటు అవినాష్ (31), అశ్విన్ (26) అనే ఇద్దరు సోదరులు పని చేస్తున్నారు. ఇంజనీరు సూరజ్ కు సోదరులు అవినాష్, అశ్విన్ కు గత ఏడాది పరిచయం అయ్యింది. రానురాను వీరి పరిచయం సన్నిహితంగా మారింది.

 పెళ్లికి పిలుచుకుని వెళ్లారు

పెళ్లికి పిలుచుకుని వెళ్లారు

చాలాకాలం నుంచి సోదరులు అవినాష్, అశ్విన్ సివిల్ ఇంజనీరు సూరజ్ దగ్గర నమ్మకంగా పని చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం అవినాష్ కుటుంబ సభ్యుల వివాహం జరిగింది. ఆ శుభకార్యానికి సివిల్ ఇంజనీరు సూరజ్ ను ఆహ్వానించారు. ఆ సందర్బంలో అవినాష్ సోదరుల కుటుంబ సభ్యులు, బంధువులు సూరజ్ కు పరిచయం అయ్యారు.

 మేస్త్రీ భార్యతో ఇంజనీర్ మస్త్ మజా

మేస్త్రీ భార్యతో ఇంజనీర్ మస్త్ మజా

పెళ్లిలో అవినాష్ భార్య కూడా ఇంజనీరు సూరజ్ కు పరిచయం అయ్యింది. అదే సమయంలో అవినాష్ భార్య మొబైల్ నెంబర్ తీసుకున్న సూరజ్ ఆమెతో చాటింగ్ చెయ్యడం, మెసేజ్ లు చెయ్యడం మొదలుపెట్టాడు. తరువాత మేస్త్రీ అవినాష్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న సూరజ్ మస్త్ మజా చేశాడు.

 పక్కాప్లాన్ తో చంపేశారు

పక్కాప్లాన్ తో చంపేశారు

కొన్ని నెలల నుంచి సివిల్ ఇంజనీరు సూరజ్, అవినాష్ భార్య ఎంజాయ్ చేస్తున్నారు. రెండు నెలల క్రితం అవినాష్ కు అతని భార్య అక్రమ సంబంధం గురించి తెలిసిపోయింది. సోదరుడు అశ్విన్, మరో స్నేహితుడితో కలిసి సివిల్ ఇంజనీరు సూరజ్ ను పక్కాప్లాన్ తో పిలుచుకుని వెళ్లి కళ్లలో కారం చల్లి కర్రలు, సిమెంట్ ఇటుకలతో కొట్టి చంపేశారు. సూరజ్ హత్య కేసులో అవినాష్, అశ్విన్ సోదరులను అరెస్టు చేశామని, వారి స్నేహితుడి కోసం గాలిస్తున్నామని భాండూప్ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+