జిఎస్టీ ఎఫెక్ట్: ఆగష్టు వరకు పాత ధరలకే మందులు
దేశమంతటా జిఎస్టీతో కలిపి అన్ని వస్తువులు లభ్యం కానున్నాయి. కానీ, ఫార్మాసూటికల్ ఉత్పత్తులను ఈ ఏడాది ఆగష్టు నాటికి పాత ధరలకే ఫార్మాసూటికల్ ఉత్పత్తులు మాత్రం పెషేంట్లకు మామూలు ధరల్లోనే లభ్యంకానున్నాయి.
న్యూఢిల్లీ: దేశమంతటా జిఎస్టీతో కలిపి అన్ని వస్తువులు లభ్యం కానున్నాయి. కానీ, ఫార్మాసూటికల్ ఉత్పత్తులను ఈ ఏడాది ఆగష్టు నాటికి పాత ధరలకే ఫార్మాసూటికల్ ఉత్పత్తులు మాత్రం పెషేంట్లకు మామూలు ధరల్లోనే లభ్యంకానున్నాయి.
పెషెంట్లు తమకు అనుకూలమైన మందులను ఆగష్టు చివరి వరకు నాన్ జిఎస్టీ ధరల్లోనే కొనుగోలు చేసుకొనేలా ఫార్మసీలు, రిటైల్ సాపులు అవకాశం కల్సిస్తున్నాయి. ఫార్మసీల్లోకి స్టాకిస్ట్ లు, రిటైల్ షాపుల్లోకి కొత్తగా సరకు వచ్చేంతవరకు పెషేంట్లకు నాన్ జిఎస్టీ ధరల్లోనే లభ్యం కానున్నాయి.

మార్కెట్ ఇన్వెంటరీ అయిపోయేంత వరకు ఇది కొనసాగుతోంది. రెండు నెలలవరకు దీనికి సమయం పట్టే అవకాశం ఉందని నిఫుణులు అభిప్రాయపడుతున్నారు. ఆగష్టు నుండి మార్కెట్లోకి వచ్చిన కొత్త స్టాక్ లను సమీక్షించిన ఎంఆర్ పీలను అప్లయ్ చేస్తారు. జిఎస్టీ అమలుతో ఇన్సులిన్ ,క్రిటికల్ కేర్ ఉత్పత్తులకు సంబంధించిన ధరలు తగ్గాయి.
కానీ, ఇవి సామాన్యులకు అందాలంటే ఇంకా రెండు నెలలు పట్టే అవకాశం ఉంది. జిఎస్టీ కింద వీటికి 5 శాతం పన్ను విధించగా, అవసరమైన మందులపై మాత్రం 12 శాతం జిఎస్టీని విధించారు. జిఎస్టీ అమలుతో కంపెనీల పన్ను చెల్లింపులు కూడ పెరగనున్నాయి.
Recommended Video

ఎన్ఎల్ఈఎం డ్రగ్స్ ధరల్లో స్వల్పంగా 2.29 శాతం పెంపు ఉండనుంది. ఎన్ఎల్ఈఎం డ్రగ్స్ లో చాలావరకు ప్రాణాలను కాపాడే మందులే ఉణ్నాయి. ఫార్మా రిటైల్ మార్కెట్లో ఇవి 25 నుండి 30 శాతం స్థానాన్ని ఆక్రమించుకొన్నాయి. సాధారణంగా మార్కెట్ ఇన్వెంటరీ రెండు నెలలకు ఉందన్నారు. ఆగష్టు నుండి పాక్షికంగా కొత్త ధరలను అమల్లోకి తీసుకొచ్చి సెప్టెంబర్ నుండి పోస్ట్ జిఎస్టీ ధరలను ఫార్మసీలు అమల్లోకి తీసుకొస్తాయని నిపుణులు అంచనావేస్తున్నారు.












Click it and Unblock the Notifications