ఎర్ర సముద్రం మీదుగా భారత్ వైపు దూసుకొస్తోన్న ప్రమాదకర మేఘాలు- విమానాలు రద్దు

ఇథియోపియాలోని హైలీ గుబ్బి అగ్నిపర్వతం పేలింది. దాదాపు 10,000 సంవత్సరాల తర్వాత విస్ఫోటనం చెందింది. దీని ఫలితంగా వెలువడిన బూడిద మేఘాలు భారత్ వైపుగా కదులుతున్నాయి. ఈ బూడిద మేఘాలు ఉత్తరాది రాష్ట్రాలను అలుముకోనున్నాయి. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దీని ప్రభావం కనిపించింది కూడా. ఈ తెల్లవారు జాము నుంచి మధ్యాహ్నం వరకు మరింత దట్టమైన బూడిద ఢిల్లీ గగనతలానికి చేరుకోవచ్చనే వాతావరణ నిపుణులు అంచనావేశారు.

దీని ప్రభావంతో ఢిల్లీ వాయుకాలుష్యం మరింత విషతుల్యమౌతుందనే భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి. హైలీ గుబ్బి అగ్నిపర్వతం పేలుతుందనే సమాచారం తెలిసినప్పటి నుంచీ దీనిపై కన్నేశారు. పేలుడు తర్వాత బూడిద మేఘాల కదలికలను ట్రాక్ చేస్తోన్నారు. రెడ్ సీ మీదుగా దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో ఇథియోపియాకు వాయువ్య దిశగా బూడిద మేఘాలు కదులుతున్నాయి. ఆ దిశలో ఉన్నది భారతే.

Ethiopian Volcano Ash Reaches Delhi Triggers Safety Alert for Airlines

ఈ విస్ఫోటనం వల్ల 10-15 కిలోమీటర్ల ఎత్తు వరకు భారీ బూడిద గాల్లోకి ఎగిసింది. సల్ఫర్ డయాక్సైడ్ తో కూడిన మేఘాలు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించిన ఫొటోను స్పుట్నిక్ ఆఫ్రికా విడుదల చేసింది. దాదాపు 10,000 సంవత్సరాలుగా నిద్రాణంగా ఉన్న అగ్నిపర్వతం ఇది. ఆదివారం మొదటిసారిగా విస్ఫోటనం చెందింది. దీనివల్ల దట్టమైన బూడిద, సల్ఫర్ డయాక్సైడ్ ఆకాశంలోకి ఎగజిమ్మాయి. మేఘాలు ఏర్పడ్డాయి.

వాతావరణ ట్రాకర్ల అంచనాల ప్రకారం- ఈ బూడిద మేఘాలు మొదట పశ్చిమ రాజస్థాన్ మీదుగా భారత్ లోకి ప్రవేశించాయి. జోధ్‌పూర్, జైసల్మేర్ మీదుగా భారత ఉపఖండాన్ని కమ్ముకుంటోన్నాయి. గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో ఈశాన్యం వైపు కదులుతున్నాయని ఇండియా మెట్ స్కై వెదర్ హెచ్చరించింది. ఈ బూడిద మేఘాలు 25,000 నుండి 45,000 అడుగుల ఎత్తులో ఆవరించి ఉన్నాయని, ఈ కారణంగా ఆకాశం వింత మెరుపులతో మెరిసిపోయే అవకాశం ఉందని మెట్ స్కై వెదర్ ట్రాకర్ తెలిపింది.

క్రమంగా రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, గుజరాత్‌, పంజాబ్, ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్.. వీటి పరిధిలోకి రావొచ్చని పేర్కొంది. ఈ బూడిద అధిక ఎత్తులో ఉన్నందున ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, స్వల్పంగా బూడిద రేణువులు రాలవచ్చని పేర్కొన్నారు.

కాగా- ఈ మేఘాల నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయాలను తీసుకుంది. నోతం, యాష్ టం జారీ చేసింది. ఇప్పటికే గగనతలంపై ఉన్న విమానాలకూ దీన్ని వర్తింపజేసింది. ఇంజిన్ లో అసాధారణ పరిణామాలు, లేదా క్యాబిన్ లో వింత వాసన వస్తే వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను సంప్రదించాలని సూచించింది. అగ్నిపర్వతాలు పేలినప్పుడు ఏర్పడే బూడిదకు సంబంధించిన విధానాలను ఆపరేషన్స్ మాన్యువల్స్‌లో పొందుపరచాలని కూడా విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ అయ్యాయి.

కొచ్చి-దుబాయ్ ఇండిగో, కొచ్చి-జెడ్డా ఆకాశ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఆమ్‌స్టర్‌డామ్-ఢిల్లీ విమాన సర్వీసును రద్దు చేసినట్లు కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తోన్నట్లు ఎయిరిండియా, స్పైస్ జెట్ వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+