వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రమాదకరం: యూరోపియన్ శాటిలైట్‌కు చిక్కిన ఢిల్లీ కాలుష్యం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నవంబర్ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లోని కాలుష్యాన్ని యూరోపియన్ శాటిలైట్ నిక్షిప్తం చేసింది. ఢిల్లీలో కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆదివారం భారత్‌తో జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా శ్రీలంక క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆటగాళ్లు మాస్కులు ధరించి ఆడారు.

ఢిల్లీ ప్రాంతంలో కాలుష్యం తీవ్ర రూపం దాల్చి ప్రమాద స్థాయికి చేరుకుంది. ఇదే విషయాన్ని యూరోపియన్‌ స్సేస్‌ ఏజెన్సీ(ఈఎస్‌ఏ) కూడా తెలిపింది. ఉత్తర భారతం ముఖ్యంగా ఢిల్లీ ప్రాంతంలో కాలుష్యం తీవ్రత ఎంత ప్రమాదకరంగా ఉందో తెలిపే ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది.

క్రికెట్‌కు ఢిల్లీ కాలుష్యం దెబ్బ: శ్రీలంక ఫిర్యాదు, మాస్కులు ధరించి చరిత్రలో తొలిసారి!క్రికెట్‌కు ఢిల్లీ కాలుష్యం దెబ్బ: శ్రీలంక ఫిర్యాదు, మాస్కులు ధరించి చరిత్రలో తొలిసారి!

European satellite captures alarming pollution over north India

నవంబర్‌ 10న దేశ రాజధాని ప్రాంతాన్ని కాలుష్యపు మేఘాలు ఏ విధంగా కమ్ముకున్నాయో తెలిపే చిత్రాలను శుక్రవారం విడుదల చేసింది. ఈఎస్‌ఏకు చెందిన సెంటినల్ 5పీ ఉపగ్రహం ద్వారా ఈ చిత్రాలను తీశారు.

భూగ్రహంపై వాతావరణ మార్పుల్ని ఇది పరిశీలిస్తుందని ఈఎస్‌ఏ డైరెక్టర్‌ ఆఫ్‌ ఎర్త్‌ అజ్బర్వేషన్‌ జోసెఫ్‌ తెలిపారు. నవంబర్‌ 6 నుంచి 14 మధ్య తక్కువ వాయు వేగం, గాలిలో అధిక తేమ, పంటలను తగలబెట్టడం తదితర కారణాలతో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిల్ని దాటింది.

మరో ఉపగ్రహ చిత్రంలో ఉత్తర పాట్నా, దక్షిణ రాయపూర్ ప్రాంతాల్లో ఉన్న పవర్ ప్లాంట్ల నుంచి వెలవడుతున్ కాలుష్యాన్ని చిత్రీకరించింది.

English summary
The European Space Agency’s (ESA) satellite images, released on Friday, show alarming levels of pollution in the national capital region on November 10, when air pollution levels peaked this season.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X