PAN-Aadhaar: ఇప్పుడు కూడా ఆధార్‍తో పాన్ లింక్ చేసుకోవచ్చు.. కానీ అప్పటి వరకు పాన్ పని చేయదు..!
ఎప్పటి నుంచో ఆధార్ పాన్ లింక్ చేసుకోవాలని ఆదాయపు పన్న శాఖ కోరుతుంది. దీనికి పలుసార్లు డెడ్ లైన్లు కూడా విధించింది. మొదటగా ఆధార్ పాన్ లింక్ చేసుకోవాలని కోరింది. ఆ గడువును పొడిగించింది. తర్వాత రూ.1000 జరిమానాతో 2023 మార్చి 31 గడువు విధించింది. దాన్ని జూన్ 30 వరకు పొడగించింది. అయినా కొందరు ఆధార్ పాన్ లింక్ చేసుకోలేదు. దీంతో వారి పాన్ కార్డులు పనిచేయవని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది.
ఆధార్ పాన్ లింక్ చేసుకోవడానికి జూన్ 30న గడువు ముగిసింది. అయితే ఇప్పటికీ కూడా ఆధార్ తో పాన్ లింక్ చేసుకోవచ్చు కానీ.. అందుకు 30 రోజుల సమయం పడుతుంది. అప్పటి వరకు పాన్ కార్డు పని చేయదు. మీరు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపలేరు. ఇప్పుడు కూడా మీరు ఆధార్ తో పాన్ కార్డును లింక్ చేసుకోవచ్చని సీబీడీటీ తెలిపింది. కానీ మీ పాన్ కార్డు నెల రోజుల పాటు పని చేయదు.

ఉదాహరణకు మీరు జులై 5న ఆదాయపు పన్ను వెబ్ సైట్ లోకి వెళ్లి రూ.1000 చెల్లించి ఆధార్ పాన్ లింక్ చేస్తారు. అయితే మీ పాన్ కార్డు ఆగస్టు 4 వరకు పని చేయదు. ఆగస్ట్ 4న పాన్ కార్డు ఆధార్ తో లింక్ అవుతుంది. అప్పుడు మీరు పాను కార్డును వాడుకోవచ్చు. అంటే మీరు రూ.1000 జరిమానా చెల్లించి.. ఆధార్ పాన్ కార్డు లింక్ చేసిన తర్వాత 30 రోజులు ఆగాల్సిందే. అప్పటి వరకు మీ పాన్ కార్డు పనిచేయదు.

గడువులోగా ఆధార్ తో పాన్ కార్డు లింక్ చేయని వారి నుంచి ఎక్కువ మొత్తంలో టీడీఎస్ వసూలు చేస్తామని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. ఇప్పటికైనా జరిమానా చెల్లించి ఆధార్ పాన్ కార్డు లింక్ చేసుకోవచ్చని తెలిపింది.












Click it and Unblock the Notifications