Dogs: కుక్క కాటుతో ప్రతి అరగంటకు ఒకరు మృతి..
దేశంలో వీధి కుక్కల దాడులు భారీగా పెరుగుతున్నాయి. సంవత్సరానికి దాదాపు 2 కోట్ల మంది కుక్క కాటుకు బారిన పడుతున్నారని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ICMR) ఓ నివేదికలో తెలిపింది. కుక్క కాటుకు గురైన వారులో 17 నుంచి 20 వేల మంది వరకు రేబిస్ వైరస్ బారిన పడుతున్నారని నివేదికలో పేర్కొంది. అంటే ప్రతి రెండు సెకండ్లకు ఒక్క కుక్క కాటు, ప్రతి అరగంటకు ఒక రేబిస్ మరణం సంభవిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా రేబిస్ మరణాలు పరిశీలిస్తే మన భారత్ లోనే 36 శాతం మంది రేబిస్ వల్ల చనిపోతున్నట్లు నివేదికలో వివరించింది. మన దేశంలో దాదాపు 70 శాతం కుక్కలను ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపింది. నివేదిక ప్రకారంలో ఇండియాలో ప్రస్తుతం కోటి 53 లక్షల కుక్కలు ఉన్నాయి. ఈ వీధి కుక్కలు ఎక్కువగా ఆస్పత్రుల ఆవరణలో ఉన్నట్టలు చెబుతున్నారు.

ఈ వీధి కుక్కల వల్ల అనే వ్యాధులు వస్తున్నాయని నివేదికలో తెలిపారు. కుక్కలు అనేక రోగాలకు వాహకాలు పని చేస్తున్నాయని హెచ్చరించారు. వీధి కుక్కల వల్ల రేబిస్, డిస్టెంపర్ వైరస్, రర్వో వైరస్, టాక్సో ప్లాస్మా, కెనైన్ అడినో వైరస్ లు వ్యాపిస్తాయని వివరించింది. ఆస్పత్రుల చుట్టుపక్కల కుక్కలకు సింపుల్ గా ఆహారం దొరుకుతుందని పేర్కొన్నారు.
గత సంవత్సరం హర్యానాలో ఓ ఆస్పత్రిలో రెండు రోజుల పసిగుడ్డును కుక్క కరిచి చంపడం సంచలనం సృష్టించింది. తాజాగా సోమవారం కూడా కర్ణాటకలోని శివమొగ్గ ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా ఓ కుక్క అప్పుడే పుట్టిన శిశువును నోట కరుచుకుని ఆస్పత్రి అంతట తిరిగింది. మూడు సంవత్సరాల క్రితం గుజరాత్ లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది.












Click it and Unblock the Notifications