• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రతి కుటుంభానికి సాలీనా రెండు లక్షల రుపాయలు ?

|

ఎన్నికల వేళ ఎన్నో పథకాలు, హమీలు, దీనికి తోడు ఇప్పటికే అమలవుతున్న పలు సంక్షేమ పథకాలు ,దీంతో భారత్ వెలిగిపోనుందా, ధనికులకు పేదలకు మధ్య అంతరం తొలిగిపోనుందా,? గరీబీ లేని దేశంగా మారుతుందా ? ఏది ఏమైనా ప్రభుత్వ పథకాలతో ఒక్కో నిరుపేద కుటుంభం భవిష్యత్ లో సంవత్సరానికి సుమారు రూ,2,00000 లను పోందనుంది.

ఉప‌గ్ర‌హాల‌ను సైతం కూల్చే శ‌క్తి భార‌త్ సొంతం..!అంత‌రిక్ష రంగంలో వినూత్న అడుగు అన్న ప్ర‌ధాని..!

చివరకు లబ్ధిపోందేది నిరుపేదలే,

చివరకు లబ్ధిపోందేది నిరుపేదలే,

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ రాజ్యం దిశగా అడుగులు వేస్తున్నాయి, ప్రభుత్వాల మధ్య పోటి తోకాని ఆర్ధిక వనరులు పెరుగుతుండడం లాంటీ అవకాశాల వల్ల భారత దేశ బీదలు లక్షాధికారులు కానున్నారు. ఈనేపథ్యంలోనే కనీస ఆదాయ పథకం పై ఇప్పుుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.ఈ పథకంతో పేదలను కనీస ఆదాయ రేఖమీద కు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రవేశ పెట్టామంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే ఈ ఆదాయం ఎక్కడనుండి వస్తుంది,ఎలా ఇస్తారు,పేదల సంపాదనకు సంబంధించిన లెక్కలు ఎక్కడ ఉన్నాయనే పలు అనుమానాలు రేకేత్తుతున్నా... అటు కాంగ్రెస్,ఇటు బీజేపి లు అందిస్తున్న పథకాలపై ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటున్నారు.అయితే వాళ్ల ప్రశ్నలు ఎలా ఉన్నా... చివరకు లాభపడదేది మాత్రం నిరుపేదలే అని చెప్పాలి. దీంతో రానున్న రోజుల్లో ప్రభుత్వాలు ఏవైనా ప్రజలకు నేరుగా లక్షల రుపాయల ఆర్ధిక లభ్ధి చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బిజేపి వాదన,

బిజేపి వాదన,

మోడి తీసుకువచ్చిన పలు పథకాల విలువ,5 లక్షల 34 వేల కోట్లు అని చెబుతున్నారు.వీటి ద్వార దేశంలోని నిరుపేద కుటుంభానికి సంవత్సరంలో లక్ష ఆరువేల రుపాయలు ఇస్తున్నామని ఆర్ధిక మంత్రి ఆరుణ్ జైట్లి చేప్పారు..నగదు బదిలీ, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్‌ వంటి పథకాల ద్వారా మోడీ ప్రభుత్వం పేదలకు ఇప్పటికే ఏటా రూ.5.34 లక్షల కోట్లను అందిస్తోందన్నారు. దీన్ని ఐదు కోట్ల కుటుంబాలకు పంచితే ఒక్కో కుటుంబానికి రూ.1,06,800 అందించినట్లవుతోందన్నారు. ఇది రాహుల్ గాంధి ప్రకటించిన 72వేల కంటే ఎక్కువే అని వివరణ ఇచ్చారు.

అరుణ్ జైట్లి చెబుతున్న సమాచారం ప్రకారం , ప్రస్తుతం ఉన్న బిజేపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలతో పాటు ,ఒక వేళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఇచ్చిన హమీలను అమలు చేస్తే భారత దేశ పేదలు ఇక లక్షాధికారులు కానున్నారు. ఎవ్వరు కూడ కనీస ఆదాయనికి తగ్గకుండా ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల రుపాలయ వరకు తమ ఆదాయన్ని పోందనున్నారు, ఓక్కో కుటుంభానికి ప్రతి సంవత్సరం 1,78,000 రుపాయల లబ్ది పోందనున్నారని చెప్పవచ్చు.

కాంగ్రెస్ వాదన

కాంగ్రెస్ వాదన

ఈనేపథ్యంలోలో మాజి ఆర్ధిక మంత్రి చిదంబరం కూడ కనీస అదాయం పథకం పై స్పందించారు.అయిదు కోట్ల మందికి ప్రతి సంవత్సరం 72 వేల రుపాయలు అందిస్తే సంవత్సరానికి దేశ బడ్జెట్ లో 3.6 లక్షల కోట్ల రుపాయలు కేటాయించాలని ,వాటిని ఎక్కడ నుండి తెస్తారనే వాదన వినిపిస్తున్న నేపథ్యంలో మాజి ఆర్ధిక మంత్రి పి. చిదంబరం స్పందించారు, అన్ని వనరులతో పాటు పలువురు ఆర్ధిక నిపుణులతో చర్చించిన తర్వాతే ఈ పథకం అమలుకు ముందుకు తెచ్చామని, చెబుతూనే, ఇండియాన్ ఎకనామీ ప్రస్థుతం 200 లక్షల కోట్లు గా ఉందని, ఇది సంవత్సరానికి 12 శాతం పెరగనుందని దీంతో రానున్న అరు సంవత్సరాల్లో భారత ఆదాయ పెరుగుదల రెండింతలు కానుందని వివరించారు.

సో మొత్తం మీద ఆర్ధిక సంస్కరణ ఫలితమో లేక మరే ఇతర కారణాలైన కావచ్చు, వీటి ద్వార పేద ప్రజలు మాత్రం అల్టిమేట్ గా అభివృద్ది పథంలోకి రానున్నారని అర్ధం చేసుకోవచ్చు.దీంతో దేశంలో అసలు బీదవారు ఉండకుండా పోయో అవకాశాలు కూడ ఉన్నాయనేది స్పష్టం అవుతోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Many welfare schemes, and assurances are being announced In the election time, and some schemes already undertaken by the present government, will all thease scheams fill the gap between the rich and the poor ? Will eradicate the Garibi ? Whatever the government schemes,the poverty-stricken family may get about Rs 2,00,000 per year in the future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more