వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ నిత్యం శ్రీరామ పారాయణమే..! మరో సారి వార్తల్లోకెక్కిన వాయనాడ్..!!

|
Google Oneindia TeluguNews

హైదరామాద్ : కొన్ని ప్రాంతాలు ఎంత చారిత్రకం ఐనప్పటికి అంతగా వెలుగులోకి రావు. అవే ప్రదేశాలు కొన్ని సందర్బాల్లో అనూహ్యంగా వార్తల్లో నానుతుంటాయి. ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ ప్రాంతానికి దేశవ్యప్తంగా గుర్తింపు వచ్చింది. నిన్నటి వరకూ ఎవరూ చెప్పుకోని రాముడి ఇతిహాసం గురించి కూడా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి లోక్ సభకు పోటీ చేస్తుండడంతో రామాయణం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సీతారాముల అరణ్యవాసం చేసింది. ఇక్కడేనని వయనాడ్ లోనే అని స్థానిక గిరిజనుల నమ్మకం. దీంతో అందరి చూపు ఇప్పుడు వయనాడ్ పై పడింది.

 వాయనాడ్ కు రామాయణంతో సంబందాలు..! వెలుగులోకి వస్తున్న వాస్తవాలు..!!

వాయనాడ్ కు రామాయణంతో సంబందాలు..! వెలుగులోకి వస్తున్న వాస్తవాలు..!!

చదువు సంధ్యలు లేకపోవడంతో రామాయణాన్ని స్థానిక భాషల్లో కంఠస్థం చేసుకొని తరతరాలుగా తమ వారసులకు అందిస్తూ వస్తున్నారు. వాయనాడ్ మొత్తం జనాభాలో ఎకంగా 18 శాతం ఉన్న గిరిజనుల్లో 12 తెగలున్నాయి. 40 నుం చి 50 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ఈ గిరిజన తెగలు రామాయణాన్ని కంఠస్థం చేశాయి. ఒక్కో తెగ ఒక్కో వ్యాఖ్యానాన్నిరామాయణానికి జోడించడం విశేషం.

 గిరిజన జీవితాలతో ముడిపడ్డ రామాయణం..! ఏకంగా 30ఘట్టాలు అక్కడ జరిగినవే..!!

గిరిజన జీవితాలతో ముడిపడ్డ రామాయణం..! ఏకంగా 30ఘట్టాలు అక్కడ జరిగినవే..!!

ప్రకృతి ఒడిలో జీవించే ఈ తెగలు తమ జీవనవిధానాన్నిరామాయణంలో జొప్పిస్తూ సరికొత్త వ్యాఖ్యానాలు రూపొందించాయి. ఒక్కో తెగకు ఒక్కో వ్యాఖ్యానం ఉండడంతో రామాయణంలోని సుమారు 30 ఘట్టాలు తమ ప్రాంతంలోనే జరిగినట్లు గిరిజనులు బలంగా నమ్ముతున్నారు.

రామాయణంలో కీలక ఘట్టాలు అక్కడే..! వాయనాడ్ లో వెలుగు చూస్తున్న నిజాలు..!!

రామాయణంలో కీలక ఘట్టాలు అక్కడే..! వాయనాడ్ లో వెలుగు చూస్తున్న నిజాలు..!!

వయనాడ్ జిల్లా కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుల్పల్లీ, కల్పేటలో వాల్మీకి ఆశ్రమం ఉండేదని వీరి నమ్మకం. సీతాదేవి తన రోజువారి పూజల కోసం పుల్పల్లీకి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘ఇరులం'లో పూలు కోసుకునేదని వీరి విశ్వాసం. ‘ ముతంగ వైల్డ్ లైఫ్ సెం చరీ'లో ఇప్పుడున్న రాం పల్లి గ్రామం దగ్గర అశ్వమేధయాగం కోసం అయోధ్యలో శ్రీరాముడు వదిలిన అశ్వాన్ని లవకుశులు ఇక్కడ అడ్డుకున్నారని చెబుతారు.

వాయనాడ్ నుండి రాహుల్ పోటీ..! ఒక్కసారిగా వార్తలంలోకి ఎక్కిన ప్రదేశం..!!

వాయనాడ్ నుండి రాహుల్ పోటీ..! ఒక్కసారిగా వార్తలంలోకి ఎక్కిన ప్రదేశం..!!

ఇక్కడి అతి పెద్ద కొండను ‘బానాగురగుట్ట'గా గిరిజనులు పిలుస్తారు. ఇలా రామాయణంలోని 30 ఘట్టాలు తమ జిల్లాలోనే జరిగాయని నమ్మే గిరిజనులు ఈ ముప్పై చోట్ల గుళ్లు కట్టి తరతరాలుగా పూజలు చేస్తున్నారు. వాయనాడ్ కు ఇంతటి ప్రాశస్తం ఉందని తాజా రాజకీయ వాతావరణం ప్రపంచానికి చాటి చెప్పిందనే చర్చ కూడా జరుగుతోంది.

English summary
Ramayana once again came to the news when Congress chief Rahul Gandhi is contesting from Wayanad in Kerala to the Lok Sabha. Seetharama made wildlife. The local tribes believe that it is here in Wayanad. This show is now on Wayanad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X