వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రంలో హెచ్ఐవి పేషెంట్ లేని గ్రామంలేదు: గోవా మంత్రి

|
Google Oneindia TeluguNews

పనాజీ: తమ రాష్ట్రంలో హెచ్ఐవి(ఎయిడ్స్) వ్యాధి లేని గ్రామం లేదని గోవా రాష్ట్ర మంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అన్నారు. ప్రతి గ్రామంలో కనీం ఒక్కరైన హెచ్ఐవి(ఎయిడ్స్) వ్యాధి కలిగి ఉంటారని ఆయన సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్పారు.‘సుమారు రాష్ట్రంలో 15,000 మంది ఎయిట్స్ రోగులు ఉన్నారు. అంటే ఇది రాష్ట్ర జనాభాలో ఒక శాతం. ఎయిడ్స్ వ్యాధి లేని ఒక్క గ్రామం కూడా రాష్ట్రం లేదు. ప్రతీ గ్రామంలో కనీసం ఒక్కరికైనా ఈ వ్యాధి ఉంటుంది' అని లక్ష్మీకాంత్ పర్సేకర్ తెలిపారు.

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే నీలేష్ కోబ్రాల్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ వివరాలు చెప్పారు. అయితే రాష్ట్రంలో ఎయిడ్స్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని మంత్రి లక్ష్మీకాంత్ తెలిపారు. 2009తో పోల్చుకుంటే ఇప్పుడు సగానికిపై ఎయిడ్స్ కేసులు తగ్గాయాని వెల్లడించారు.

Every Village in Goa Has HIV Patient, Says Minister

‘2003 నుంచి 2008 వరకు ప్రతీ ఏడాది 1,000 కేసులు నమోదవుతూ వచ్చాయి. కానీ 2009 నుంచి ఆ సంఖ్య ప్రతి ఏడాదికి 550కి పడిపోయింది' అని మంత్రి చెప్పారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రభుత్వం వ్యాధి పట్ల ప్రభుత్వం చేపడుతున్న అనేక ప్రజా చైతన్య కార్యక్రమాల వల్లే ఈ ఫలితాలు వచ్చాయని వివరించారు.

2012లో 554 కేసులు నమోదవగా.. 2013లో 532 హెచ్ఐవి (ఎయిడ్స్) కేసులు నమోదయ్యాయని మంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ చెప్పారు. ఈ ఏడాది(2014) జూన్ వరకు 246 హెచ్ఐవి కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు.

English summary
Goa does not have a single village unaffected with HIV, state Health Minister Laxmikant Parsekar said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X