అంతా సారీ చెప్పాలంటున్నారు, కానీ నూపుర్ శర్మకు నా మద్దతు: ఒవైసీపై రాజ్ థాక్రే ఫైర్
ముంబై: మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేపి, సస్పెన్షన్‌కు గురైన బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ థాకరే మంగళవారం మద్దతు పలికారు.
తాజాగా, ఇండియా టుడేతో రాజ్ థాకరే మాట్లాడుతూ.. "నూపుర్ శర్మ క్షమాపణ చెప్పాలని అందరూ కోరారు. నేను ఆమెకు మద్దతు ఇచ్చాను. ఆమె చెప్పినది ఇంతకు ముందు డాక్టర్ జాకీర్ నాయక్ చెప్పారు. నాయక్ నుంచి ఎవరూ క్షమాపణలు అడగలేదు అని అన్నారు.
ఒక టీవీ చర్చ సందర్భంగా ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్య దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. అనేక గల్ఫ్ దేశాల నుండి తీవ్ర ప్రతిస్పందనలు వచ్చాయి. దీంతో బీజేపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

ఆగస్టు 10న, నూపుర్ శర్మపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ కలిపి సుప్రీం కోర్టు ఢిల్లీ పోలీసులకు బదిలీ చేసింది. గత నెల, ఆమెపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి ఆగస్టు 10 వరకు అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణను మంజూరు చేసింది.
మరోవైపు, హిందూ దేవుళ్లను, దేవతలను అవమానించారంటూ ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై కూడా థాక్రే మండిపడ్డారు.
తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండే పార్టీలో చీలికను సృష్టించి, బిజెపి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అధికారం నుంచి తొలగించబడిన శివసేన నాయకుడు ఉద్ధవ్ థాకరేను కూడా ఆయన లక్ష్యంగా చేసుకున్నారు.
2019లో బీజేపీతో ఉద్ధవ్‌కు 2.5 ఏళ్లకే సీఎం పదవి వస్తుందని అధికార భాగస్వామ్య ఒప్పందంపై ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత శివసేన చివరకు బీజేపీతో పొత్తును తెంచుకుంది. మహారాష్ట్రలో అధికార వాటా కోసం కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపింది.
"నేను సేనలో ఉన్నప్పుడు, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకే సీఎం సీటు వస్తుందని బాలాసాహెబ్ నిర్ణయించారు. నిర్ణయించిన విషయాలను మీరు ఎలా మార్చగలరు? అది కూడా మూసిన తలుపుల వెనుక. ఎన్నికల ప్రచారంలో ఫడ్నవీస్ సీఎం అవుతారని ప్రధాని, అమిత్ షా చెప్పినప్పుడు మీరు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు' అని రాజ్ థాక్రే నిలదీశారు.












Click it and Unblock the Notifications