ఈవీఎం ట్యాంపరింగ్ ఇష్యూ: ఏదో ఓ పార్టీ ఇష్యూ కాదు.. కపిల్ సిబాల్ ఏం చెప్పారంటే?
న్యూఢిల్లీ: సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా.. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయంటూ సోమవారం సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. లండన్‌లో జరిగిన కార్యక్రమంలో షుజా మాట్లాడుతూ... 2014 ఎన్నికలు రిగ్గింగ్ అయ్యాయని ఆరోపించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చునని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ ఉన్నారు. దీంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. దీనిపై ఆయన స్పందించారు. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఏదో ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదని చెప్పారు. ఇది రాజ్యాంగానికి సంబంధించిన సమస్య అన్నారు.

తాను లండన్‌కు వెళ్లింది వ్యక్తిగత కారణాల మీద అని చెప్పారు. ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ లండన్ అధ్యక్షుడు ఆహ్వానించడంతో తాను ఈ కార్యక్రమానికి వెళ్లానని చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌తో సహా అన్ని పార్టీలకు ఆహ్వానం పంపించినట్లు వారు చెప్పారని అన్నారు.
రాజ్యాంగాన్ని పరిరక్షఇంచుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీల పైన ఉందని చెప్పారు. సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా గురించి తనకు ఏమాత్రం తెలియదని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై కేంద్రం కచ్చితంగా విచారణ జరిపించాలన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం పోలీసులకు మంగళవారం లేఖ రాసింది. ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారం, ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా పైన చర్యలు తీసుకోవాలని ఈసీ కోరింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications