మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ మరోసారి ఈవీఎంల కలకలం చెలరేగింది. ఈవీఎంలో ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు పడుతోందంటూ గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. అయితే కేంద్రం, ఈసీ వాటిని తోసిపుచ్చాయి. అయితే తాజాగా కేరళలోని కాసర్ గోడ్ లో మరోసారి దీన్ని అవునని నిరూపించే ఘటన చోటు చేసుకుంది. స్దానిక మీడియా సంస్ధ మనోరమా అందించిన వివరాల ప్రకారం మాక్ పోలింగ్ సందర్భంగా ఈ మోసం బయటపడింది.
అసలేం జరిగిందంటే..కేరళలోని కాసర్ గోడ్ లోక్ సభ నియోజకవర్గంలో త్వరలో జరిగే ఎన్నికల కోసం ఈసీ మాక్ పోలింగ్ నిర్వహిస్తోంది. ఇందులో అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ తో పాటు బీజేపీ అభ్యర్ధుల పోలింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఈవీఎంలలో తమ గుర్తులు ఉన్న బటన్లు నొక్కుతుంటే ఓట్లు మాత్రం బీజేపీ గుర్తు కమలానికి పడుతున్నాయంటూ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పోలింగ్ ఏజెంట్లు ఫిర్యాదు చేశారు.

కాసర్ గోడ్ లో బీజేపీ అభ్యర్ధిగా ఎంఎల్ అశ్విని పోటీ చేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గాన్ని ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇలాంటి సమయంలో ఈవీఎంలలో ఏ పార్టీ బటన్ నొక్కినా బీజేపీకే పడుతుండటంపై ప్రత్యర్ధులు మండిపడుతున్నారు. అలాగే ఈవీఎంలలో కాంగ్రెస్ పార్తీ హస్తం గుర్తును చిన్న సైజులో ప్రింట్ చేయడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈవీఎంలలో బీజేపీ కమలం గుర్తును మొదటి స్ధానంలో ఉంచండంపైనా విమర్శలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications