EX CM: కొడుకు కోసం మాజీ సీఎం సంచలన నిర్ణయం, త్యాగం, ఆ ముగ్గురే డిసైడ్ చేస్తారు !
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సంచలన నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గం నుంచి తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చెయ్యనని, తన కుమారుడు ఆ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప మీడియా ముందు చెప్పారు. తన నియోజక వర్గం ప్రజలు తన కుమారుడు విజయేంద్రను పోటీలో దింపాలని తన మీద ఒత్తిడి చేస్తున్నారని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప అన్నారు. అయితే తన కొడుకు విజయేంద్ర ఆ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలా ?, వద్దా ? అనే విషయంలో ముగ్గురు నిర్ణయం తీసుకుంటారని, ఈ విషయంలో నేనే అంతే చెప్పగలను అంటూ మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప బాంబు పేల్చారు.

మాజీ సీఎం అడ్డా
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్, యడియూరప్పకు ఎంత పలుకుబడి ఉందో అనే విషయం కొత్తగా చెప్పనవసరం లేదు. దక్షిణ భారతదేశంలో బీజేపీని మొదటిసారి అధికారంలోకి తీసుకు వచ్చిన వ్యక్తిగా బీఎస్, యడియూరప్ప ఓ రికార్డు బ్రేక్ చేశారు. అలాంటి మాజీ ముఖ్యమంత్రి తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని చెప్పడంతో ఆయన వర్గీయులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

కొడుకును రంగంలోకి దించిన మాజీ సీఎం
శివమొగ్గ జిల్లాలోని శికారీపుర నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయిన బీఎస్ యడియూరప్ప తరువాత కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సంచలన నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శికారిపుర నియోజక వర్గం నుంచి తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చెయ్యనని బాంబు పేల్చారు.

నా కొడుకు పోటీ చేస్తాడు
తన కుమారుడు విజయేంద్ర శికారిపుర నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప మీడియా ముందు చెప్పారు. తన నియోజక వర్గం శికారిపుర ప్రజలు తన కుమారుడు విజయేంద్రను పోటీలో దింపాలని తన మీద ఒత్తిడి చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప అన్నారు.

ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా డిసైడ్ చేస్తారు
తన కొడుకు విజయేంద్ర శికారిపుర నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలా ?, వద్దా ?, వేరే నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలా అనే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకుంటారని, ఈ విషయంలో నేనే అంతే చెప్పగలను అంటూ కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప బాంబు పేల్చారు. పాత మైసూరు ప్రాంతంతో పాటు ఎక్కడైనా విజయేంద్ర సులభంగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ధీమా వ్యక్తం చేవారు.