ప్రభుత్వ క్వాటర్స్ లో యువతిపై గ్యాంగ్ రేప్, మాజీ పోలీసు అరాచకం, కారులో ఎత్తుకెళ్లిన కామాంధులు!

భువనేశ్వర్: పోలీసు ఐడీ కార్డు (గుర్తింపు కార్డు) చూపించి యువతిని బెదిరించి బలవంతంగా కారులో ఎత్తుకెళ్లి ప్రభుత్వ క్వాటర్స్ ఆమె మీద సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పూరిలో జరిగింది. యువతి మీద సామూహిక అత్యాచారం చేసిన మాజీ పోలీసుతో పాటు అతని సహచర కామాంధుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి మీద సామూహిక అత్యాచారం చేసిన కేసులో మాజీ పోలీసును అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించామని సెంట్రల్ రైంజ్ డీఐజీ (క్రైం) ఆశీష్ కుమార్ చెప్పారు.

బస్సు కోసం యువతి!

బస్సు కోసం యువతి!

ఒడిశాలోని భువనేశ్వర్ లో నివాసం ఉంటున్న యువతి పూమ జిల్లాలోని సొంత గ్రామం కాకత్ పూర్ వెళ్లడానికి సోమవారం భువనేశ్వర్ నుంచి బస్సులో బయలుదేరింది,. మద్యాహ్నం బస్సు నిమపార బస్ స్టాప్ చేరుకుంది. ఆ సమయంలో యువతి ఆహారం తీసుకోవడానికి బస్సు దిగింది. అదే సమయంలో ఆమె వచ్చిన బస్సు వెళ్లిపోయింది. సొంత గ్రామానికి వెళ్లడానికి ఆ యువతి మద్యాహ్నం నిమపార బస్ టెర్మినల్ లో వేచి ఉంది. ఆ సమయంలో మాజీ పోలీసు జితేంద్ర సేథి, అతని సహచరులు అక్కడికి వెళ్లారు. యువతికి పోలీసు గుర్తింపు కార్డు చూపించిన జితేంద్ర సేథి నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని, మేము నీకు సహాయం చేస్తామని యువతికి మాయమాటలు చెప్పారు.

 దౌర్జన్యంగా కారులో ఎక్కించి!

దౌర్జన్యంగా కారులో ఎక్కించి!

మీ సహాయం తనకు అవసరం లేదని, బస్సు వచ్చిన తరువాత తాను ఊరికి వెలుతానని యువతి మాజీ పోలీసు జితేంద్ర సేథికి చెప్పింది. అయితే మా సహాయం వద్దని చెబుతావా ? నీకు ఎంత ధైర్యం ? అంటూ జితేంద్ర, అతని సహచరులు నలుగురు కలిసి యువతిని బలవంతంగా లాక్కెళ్లి కారులో ఎక్కించుకున్నారు.

ప్రభుత్వ క్వాటర్స్ లో గ్యాంగ్ రేప్

ప్రభుత్వ క్వాటర్స్ లో గ్యాంగ్ రేప్

యువతిని కారులో నేరుగా పవిత్ర పుణ్యక్షేత్రం అయిన పూరిలోని జడేశ్వరి ఆలయం సమీపంలోని ప్రభుత్వ క్వాటర్స్ లోకి తీసుకెళ్లారు. ఇద్దరు వ్యక్తులు క్వాటర్స్ బయట తాళం వేశారు. మాజీ పోలీసు జితేంద్రతో పాటు మరో వ్యక్తి గదిలో యువతి మీద అత్యాచారం చేశారు. కేకలు వేస్తా చంపేస్తామని యువతిని బెదిరించారు. తరువాత బయట ఉన్న మరో ఇద్దరు గదిలోకి వెళ్లి యువతి మీద అత్యాచారం చేశారు.

మద్యం మత్తులో కామాంధులు

మద్యం మత్తులో కామాంధులు

తన మీద అత్యాచారం చేసిన తరువాత నిందితులు మద్యం మత్తులో నిద్రపోయారని, ఓ వ్యక్తి సహాయంతో కిటికీలో నుంచి బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డానని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాలు, సమాచారం మేరకు మాజీ పోలీసు జితేంద్ర సేథిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జలాయిగా తిరుగుతున్న పోలీసు

జలాయిగా తిరుగుతున్న పోలీసు

ఉద్యోగం సక్రమంగా చెయ్యకుండా నిర్లక్షం చేసిన జితేంద్ర సేథిని కొంత కాలం క్రితం ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశామని సెంట్రల్ రైంజ్ డీఐజీ ఆశీష్ కుమార్ మీడియాకు చెప్పారు. నిందితుడు జితేంద్ర సేథి జులాయిగా అతని సహచరులతో కలిసి తిరుగుతున్నాడని, యువతి సామూహిక అత్యారం కేసులో అతన్ని అరెస్టు చేశామని డీఐజీ ఆశీష్ సేథి అన్నారు. మొత్తం ఈ కేసులో నలుగురు నిందితులు ఉన్నారని, మరో ముగ్గురు మీద అనుమానం ఉందని యువత చెప్పిందని, నిందితులు అందర్నీ త్వరలో అరెస్టు చేస్తామని డీఐజీ ఆశీష్ కుమార్ చెప్పారు. యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించామని, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని డీఐజీ ఆశీష్ కుమార్ మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+