ఢిల్లీ మాజీ మంత్రి తోమర్ కు బెయిల్ ఇవ్వం: కోర్టు

న్యూఢిల్లీ: నకిలీ డిగ్రీలు సమర్పించిన కేసులో అరెస్టు అయిన ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ కు కోర్టులో చుక్కెదురైంది. తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని సమర్పించిన అర్జీని న్యాయస్థానం కొట్టివేసింది.

నకిలి డిగ్రీలు సమర్పించారని జితేంద్ర సింగ్ తోమర్ ను మంగళవారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు తోమర్ ను విచారించడానికి మెజిస్ట్రేట్ కోర్టు పోలీసులకు అనుమతి ఇచ్చింది. తనను అన్యాయంగా అరెస్టు చేశారని తోమర్ కోర్టును ఆశ్రయించాడు.

Ex Delhi law minister Jitendar Tomar bail plea, rejects

అయితే బుధవారం తోమర్ సమర్పించిన అర్జీని విచారించడానికి న్యాయస్థానం నిరాకరించింది. విచారణ గురువారం నాటికి వాయిదా వేసింది. గురువారం సెషన్స్ కోర్టులో అర్జీ విచారణ జరిగింది. తన క్లయింట్ ను అన్యాయంగా అరెస్టు చేశారని తోమర్ న్యాయవాది కోర్టులో వాదించారు.

తోమర్ కు బెయిల్ ఇవ్వరాదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం తోమర్ కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. తాము పై కోర్టును ఆశ్రయిస్తామని ఢిల్లీ మాజీ మంత్రి తోమర్ న్యాయవాదులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+