గుజరాత్ మాజీ ఐపీఎస్‌కు జీవిత ఖైదు : కస్టోడియల్ డెత్ కేస్‌లో కోర్టు తీర్పు
జామ్‌నగర్ : గుజరాత్ అల్లర్ల సమయంలో పోలీసు అదుపులో ఉన్న వారు మరణించిన కేసులో అప్పటి ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను కోర్టు దోషిగా తేల్చింది. భట్ నిర్లక్ష్యం వల్లే ఒకరు చనిపోయారని జామ్‌నగర్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో భట్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తున్నట్టు తెలిపింది. అయితే పోలీసు ఉన్నతాధికారి జీవితఖైదు విధించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది.

అదుపులోకి తీసుకుంటే ..
1990లో గుజరాత్ అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జామ్‌నగర్ జిల్లా ఏఎస్పీ సంజీవ్ భట్ పనిచేస్తున్నారు. జామ్ జోద్ పూర్ పట్టణంలో అల్లర్లు జరిగే సమయంలో భట్ .. దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిలో చాలా మంది అల్లర్ల వాళ్ల గాయపడ్డారు. దీంతోపాటు ప్రభుదాస్ వైష్ణనీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వాస్తవానికి అతనిని విడుదల చేశాక .. చికిత్స తీసుకుంటూ మృతిచెందాడు. అయితే దీనిపై అతని సోదరుడు సంజీవ్ భట్‌పై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్‌లో మరో ఆగురుగురు పోలీసుల పేర్లు కూడా చేర్చారు. భట్ సహా ఆరుగురు పోలీసుల వేధింపులు భరించలేక తన సోదరుడు చనిపోయాడని పేర్కొన్నారు. ఈ కేసుపై జామ్‌నగర్ సెషన్స్ కోర్టులో వాదనలు జరిగాయి. ఇవాళ న్యాయమూర్తి తన తీర్పును వెల్లడించారు.

విచారణకు స్వీకరించని పిటిషన్ ...
ఈ కేసుకు సంబంధించి గత వారం మరో పిటిషన్ కూడా దాఖలు చేశాడు భట్. మరో 11 మందిని విచారించాలని కోరగా .. కోర్టు తిరస్కరించింది. జస్టిస్ ఇందిరా బెనర్జీ, అజయ్ రాస్తోగి నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ .. ఇప్పటికే ఈ పిటిషన్ విచారించినందున తాము మళ్లీ విచారించాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అల్లర్లు జరిగిన సమయంలో భట్ 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అందులో ప్రభుదాస్ అనే అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడంతో కేసు నమోదైంది.

ఇలా లైమ్‌లైట్‌లోకి ...
వాస్తవానికి సంజీవ్ భట్ 2011లో వెలుగులోకి వచ్చారు. గుజరాత్ అల్లర్లకు అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ పాత్ర ఉందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భట్ పిటిషన్‌తో ఒక్కసారికి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. అయితే ఆ తర్వాత భట్‌ను గుజరాత్ ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. ఆయనను అకారణంగా విధుల నుంచి తప్పించింది. తమకు చెప్పకుండా విధులకు హాజరవడం లేదని, అలాగే తన అధికార వాహనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై సస్పెండ్ చేశారు. తర్వాత 2015లో విధుల నుంచి మొత్తానికి తొలగించారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత కస్టిడియల్ డెత్ కేసు విచారణలో భట్‌ను దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications