EX lover: పెళ్లి చేసుకోకుండానే సహజీవనం, గొడవలు, మాజీ గర్ల్ ఫ్రెండ్ ను చంపేసిన కేటుగాడు !
ముంబాయి: కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్న యువతి మంచి జీతం తీసుకుంటూ ఆమె తల్లితో కలిసి నివాసం ఉండేది. తల్లితో కలిసి నివాసం ఉంటూ ఉద్యోగం చేస్తున్న యువతికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. రానురాను స్నేహితుడు ప్రియుడు అయ్యాడు. ప్రేమించుకున్న యువతి, యువకుడు పెళ్లి చేసుకోకుండానే కలిసి కాపురం చేశారు. ప్రియుడితో కలిసి సహజీవనం సాగిస్తున్న యవతికి, ఆమె ప్రియుడికి తేడాలు వచ్చాయి. రానురాను గొడవలు ఎక్కువ కావడంతో ప్రేమికులు విడిపోయారు. తరువాత మాజీ ప్రియుడిని కలవడానికి వెళ్లిన యువతి దారుణ హత్యకు గురైయ్యింది. మాజీ ప్రియురాలిని హత్య చేసిన ఆమె మాజీ ప్రియుడు శవాన్ని తీసుకెళ్లి మాయం చెయ్యడానికి అనేక పయత్నాలు చేశాడు.

కాల్ సెంటర్ లో ఉద్యోగం
ముంబాయిలోని విలేపార్లేలో కేథరీన్ అనే యువతి నివాసం ఉంటున్నారు. కేథరీన్ అనే మహిళకు కరోల్ మిస్కిట్టా 928) అనే కుమార్తె ఉంది. ముంబాయిలోని ప్రముఖ కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తోంది. కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్న కరోల్ మిస్కిట్టా మంచి జీతం తీసుకుంటూ ఆమె తల్లి కేథరీన్ తో కలిసి నివాసం ఉండేది.

ప్రియుడితో సహజీవనం
కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్న కరోల్ కు 2011లో జికో మిస్కిట్టా అనే యువకుడు పరిచయం అయ్యాడు. రానురాను స్నేహితుడు జికో కరోల్ కు ప్రియుడు అయ్యాడు. ప్రేమించుకున్న కరోల్, జికో పెళ్లి చేసుకోకుండానే ఎవ్వరిని లెక్క చెయ్యకుండా ముంబాయిలో అద్దె ఇల్లు తీసుకుని కాపురం చెయ్యడం మొదలు పెట్టారు.

ఇంటి నుంచి వెళ్లి హత్యకు గురైన ప్రియురాలు
జికోతో కలిసి సహజీవనం సాగిస్తున్న కరోల్ కు ఆమె ప్రియుడికి తేడాలు వచ్చాయి. రానురాను గొడవలు ఎక్కువ కావడంతో జికో, కరోల్ విడిపోయారు. తరువాత ఇద్దరూ అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్లు. జనవరి 25వ తేదీన మాజీ ప్రియుడు జికోను కలవడానికి వెళ్లిన కరోల్ ను ఆమె ప్రియుడు చంపేశాడు. మాజీ ప్రియురాలు కరోల్ నుని హత్య చేసిన ఆమె మాజీ ప్రియుడు శవాన్ని తీసుకెళ్లి మహారాష్ట్రలోని లార్లర్ జిల్లాలో విసిరేసి ఆ శవం మాయం చెయ్యడానికి అనేక పయత్నాలు చేశాడు. అయితే మాజీ ప్రియురాలిని హత్య చేసిన జికో ఇంతకాలానికి పోలీసులకు చిక్కిపోయాడు. మాజీ ప్రియురాలిని హత్య చెయ్యడానికి ఆమె మాజీ ప్రియుడికి ఒ స్నేహితుడు కూడా సహకరించాడని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications