Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓటర్ల వెన్నుపోటు, నమ్మకద్రోహులు, ఎన్నికల ప్రచారంలో టాప్ లీడర్ సంచలన వ్యాఖ్యలు, షాక్ !

కోలారు జిల్లా శ్రీనివాసపుర అసెంబ్లీ నియోజక వర్గం ఓటర్లపై మాజీ ఎమ్మెల్యే, కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఓటమికి కారణమైన ఓటర్లపై రమేశ్‌ కుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ నియోజకవర్గ ప్రజలు ఉలిక్కిపడ్డారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో మాజీ స్పీకర్ రమేష్ కుమార్ ఇక్కడి ఓటర్లు తనకు వెన్నుపోటు పొడిచారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీ వ్యాలీ ప్రాజెక్టులో తాను ఏమైనా మురుకి నీటిని విడుదల చేశానా ? అని ఓటర్లను ఉద్దేశించి ఎగతాళి చేశారు. మాజీ ప్రధాని దేవేగౌడ, మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి మీ కోసం ఇప్పుడు కేసీ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా కావేరీ నీటిని విడుదల చేశారా అని మాజీ స్పీకర్ రమేష్ కుమార్ ఓటర్లను ప్రశ్నించారు. శ్రీనివాసపురం ప్రజలకు నేను ఏం చేశాను అనేది మీకు తెలుసు అని, మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామి మీ నియోజక వర్గానికి ఏం చేశారో మీకే తెలుసు అని మాజీ స్పీకర్ రమేష్ కుమార్ ఆరోపించారు.

Ex-Speaker Ramesh Kumar is angry with the people that voters have cheated him

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఎన్నికల ప్రచారం చేసిన మాజీ స్పీకర్ రమేష్ కుమార్ శ్రీనివాసపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, ఓటర్లపై విరుచుకుపడ్డారు. నాకు కులం లేకపోవడం వల్లే తాను ఎన్నికల్లో ఓడిపోయానని, కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు డబ్బులకు అమ్ముడుపోయారని మాజీ స్పీకర్ రమేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను వెన్నుపోటు పొడిచినట్లు కోలార్ లోక్ సభ నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్థి కేవీ గౌతమ్ ను వెన్నుపోటు పొడవకూడదని రమేష్ కుమార్ మనవి చేశారు.

నేను ఓడిపోతే నాకు నష్టం లేదని, నన్ను గెలిపించే అర్హత మీకు లేదని అనేను అనుకుంటున్నానని రమేష్ కుమార్ బహిరంగ సభలో మాట్లాడటంతో కాంగ్రెస్ నాయకులు షాక్ అయ్యారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కేవీ గౌతమ్‌కు ఓటు వేసి గెలిపించాలని, రాహుల్‌గాంధీ చేయ్యి పట్టుకుని ఆయన నాయకత్వాన్ని బలోపేతం చేయండి, అప్పుడు మారిపోయిన రమేష్‌ కుమార్‌గా నేను మీ ముందుకు వస్తానని, అంత వరకు ఓటు వెయ్యండి అంటూ మీ ముందు చేతులు జోడించడని మాజీ స్పీకర్ రమేష్ ఆవేశంగా మాట్లాడారు.

Ex-Speaker Ramesh Kumar is angry with the people that voters have cheated him

నన్ను వెన్నుపోటు పొడిచింది ఈ నియోజకవర్గ ప్రజలే,

అసెంబ్లీ ఎన్నికల ఓటమి చేదును గుర్తు చేసుకుంటున్నాను. నేను మాట్లాడిన విషయాన్ని అందరూ రికార్డ్ చేయండి, ఎందుకంటే యావత్ భారతదేశంలోని ప్రతి ఒక్కరూ దీనిని చూడాలి అని మాజీ స్పీకర్ రమేష్ కుమార్ ఆవేశంతో ఊగిపోయారు. మీరు ఒక అవగాహనకు వచ్చేసరికి నేనూ, మా అన్నయ్య బతికి ఉంటే ఎలాగోలా ఉంటామని, నమ్మక ద్రోహం, వెన్నుపోటు పొడవడంలో మీకు మించిన వారు లేరని మాజీ స్పీకర్ రమేష్ కుమార్ ఆయన సొంత నియోజక వర్గంలోని ప్రజలను ఉద్దేశించి ఇలా మాట్లాడటం కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపింది

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+