బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Exams: రెండేళ్ల తరువాత నేరుగా 10వ తరగతి పరీక్షలు, హిజాబ్ నాట్ అలౌడ్, మొండికేస్తే అంతే, నో ఎంట్రీ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో రెండు సంవత్సరాలు పదోతరగతి పరీక్షలకు విద్యార్థులు నేరుగా హాజరుకాలేదు. రెండు సంవత్సరాల తరువాత పూర్తిస్థాయిలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పరీక్షలు రాయడానికి వచ్చే విద్యార్థులు కచ్చితంగా యూనీఫామ్ వేసుకుని రావాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు ఎవ్వరూ మతపరమైన దుస్తులు, వస్త్రాలు వేసుకుని పరీక్షలకు హాజరుకాకూడదని విద్యాశాఖ అధికారులు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కలకలం రేపిన హిజాబ్ వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. హిజాబ్ లు వేసుకుని 10వ తరగతి పరీక్షలకు హాజరుకాకూడదని, హిజాబ్ లు వేసుకుని వస్తే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని విద్యాశాఖా అధికారులు తేల్చి చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారి శాంతించడంతో ఈ సంవత్సరం 8. 73 వేల మంది విద్యార్థులు నేరుగా పరీక్షా కేంద్రాలకు హాజరై 10వ తరగతి పరీక్షలు రాయడానికి సిద్దం అయ్యారు, సోమవారం నుంచి ఏప్రిల్11వ తేదీ వరకు కర్ణాటకలో 10వ తరగతి పరీక్షలు రాయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Revenge: మోదీ, సీఎం వీరాభిమాని, ముస్లీం యువకుడిని వెంటాడి నరికి చంపిన ముస్లీం యువకులు, అప్పుడే !Revenge: మోదీ, సీఎం వీరాభిమాని, ముస్లీం యువకుడిని వెంటాడి నరికి చంపిన ముస్లీం యువకులు, అప్పుడే !

రెండు సంవత్సరాల తరువాత !

రెండు సంవత్సరాల తరువాత !

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో రెండు సంవత్సరాలు పదోతరగతి పరీక్షలకు విద్యార్థులు నేరుగా హాజరుకాలేదు. రెండు సంవత్సరాల తరువాత పూర్తిస్థాయిలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. కర్ణాటకలో 2021-22 విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి.

యూనీఫామ్ కచ్చితంగా ఉండాలి

యూనీఫామ్ కచ్చితంగా ఉండాలి


కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పరీక్షలు రాయడానికి వచ్చే విద్యార్థులు కచ్చితంగా యూనీఫామ్ వేసుకుని రావాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. యూనీఫామ్ లు లేకుండా 10వ తరగతి పరీక్షలకు హాజరుకావడానికి విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని పలు జిల్లాల్లో తల్లిదండ్రులు చేసిన మనవిని కర్ణాటక విద్యాశాఖ అధికారులు తిరస్కరించారు.

హిజాబ్ నాట్ అలౌడ్

హిజాబ్ నాట్ అలౌడ్

విద్యార్థులు ఎవ్వరూ మతపరమైన దుస్తులు, వస్త్రాలు వేసుకుని పరీక్షలకు హాజరుకాకూడదని విద్యాశాఖ అధికారులు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కలకలం రేపిన హిజాబ్ వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. హిజాబ్ లు వేసుకుని 10వ తరగతి పరీక్షలకు హాజరుకాకూడదని, హిజాబ్ లు వేసుకుని వస్తే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని విద్యాశాఖా అధికారులు తేల్చి చెప్పారు. కర్ణాటక హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటించాలని విద్యాశాఖ అధికారులు మనవి చేశారు.

 8.73 లక్షల మంది విద్యార్థులు

8.73 లక్షల మంది విద్యార్థులు

కరోనా వైరస్ మహమ్మారి శాంతించడంతో ఈ సంవత్సరం 8. 73 వేల మంది విద్యార్థులు నేరుగా పరీక్షా కేంద్రాలకు హాజరై 10వ తరగతి పరీక్షలు రాయడానికి సిద్దం అయ్యారు, 4, 52, 732 మంది అబ్బాయిలు, 4, 21, 110 మంది అమ్మాయిలు, 4, 518 మంది తృతీయ లింగ విద్యార్థులు పరీక్షలకు రాయడానికి సిద్దం అయ్యారు. మార్చి 28వ తేదీ సోమవారం నుంచి ఏప్రిల్11వ తేదీ వరకు కర్ణాటకలో 10వ తరగతి పరీక్షలు రాయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

English summary
Exams: SSLC exams to begin from monday in Karnataka, Hijab not allowed inside board exam hall.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X