డైలీ హంట్ సీఈఓ వీరేంద్ర గుప్తా, అధ్యక్షుడు ఉమాంగ్ బేడీలకు ఎక్స్‌ఛేంజ్ 4 మీడియా అవార్డు

Recommended Video

    డైలీ హంట్ కు ఎక్స్‌ఛేంజ్ 4 మీడియా అవార్డు...! | Oneindia Telugu

    ప్రముఖ న్యూస్ యాప్ డైలీ హంట్ వ్యవస్థాపకులు మరియు సీఈఓ వీరేంద్ర గుప్తా, డైలీ హంట్ అధ్యక్షుడు ఉమాంగ్ బేడీలను ఎక్స్‌ఛేంజ్ 4 మీడియా ఇన్ల్ఫుయెన్సర్ అవార్డుతో గౌరవించారు. 2017లో ఈ అవార్డును అందుకున్న డబ్ల్యూపీపీ కంట్రీ మేనేజర్ సీవీఎల్ శ్రీనివాస్, 2016లో ఎక్స్‌ఛేంజ్ 4 మీడియా ఇన్ల్ఫుయెన్సర్ అవార్డు విజేత , వయాకామ్ 18 సీఓఓ రాజ్‌నాయక్‌లు ఈ అవార్డును వీరేంద్ర గుప్తా, ఉమాంగ్ బేడీలకు అందజేశారు.

    "వీరేందర్ గుప్తాతో ప్రయాణం ఒక అద్భుతం. ఇద్దరి ఆలోచనలు ఒకటి కావడంతో మేము సోదరుల్లా ఉంటాం. దేశానికి ఏమి కావాలో వీరేంద్ర ఆలోచిస్తుంటారు. వ్యాపారం ఏ స్థాయిలో ఉండాలో నేను అర్థం చేసుకుంటాను. మాకున్న నైపుణ్యతపై పరస్పరం అభినందించుకుంటూ ముందుకు వెళుతుంటాం. జీవితంలో ఎవరికైనా సరే ఒక సోదరుడు అవసరం. నా అవసరాన్ని ఒక అన్నగా వీరేంద్ర తీర్చాడు" అని డైలీ హంట్ అధ్యక్షుడు ఉమాంగ్ బేడీ అన్నారు.

    exchange4media Influencer of the Year Award conferred upon Virendra Gupta and Umang Bedi

    " డైలీ హంట్ తరపును మాకు వచ్చిన అవార్డును ఎంతో గర్వంగా స్వీకరిస్తున్నాను. డిజిట్ మీడియాలో కొత్త ఒరవడిని సృష్టించేందుకు మా కంపెనీ ప్రయత్నిస్తోంది. అంతేకాదు ఫేస్‌బుక్, గూగుల్‌ కంటే మెరుగైన పనితీరును కనబర్చేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే నెలకు 150 మిలియన్ యాక్టివ్ యూజర్లు ఉండగా... వచ్చే ఏడాదికల్లా నెలకు 300-350 మిలియన్ యాక్టివ్ యూజర్లు వస్తారని భావిస్తున్నాం. మాకు ఈ అవార్డు దక్కిందంటే అది మామీద మీరు చూపిన నమ్మకమే . దాన్ని కచ్చితంగా నిలబెట్టుకుంటాం. ఇప్పుడిప్పుడే మా ప్రయాణం మొదలైంది. " అని వీరేంద్ర గుప్తా అన్నారు.

    2016లో ఎక్స్‌ఛేంజ్ 4 మీడియా ఇన్ల్ఫుయెన్సర్ అవార్డులు ప్రారంభమయ్యాయి. వ్యాపార రంగంలో కొత్త పుంతలు తొక్కుతూ వ్యాపార వృద్ధికి వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, తద్వారా వ్యాపార రంగంలో విజయాలు సాధిస్తున్న వారిని ఈ అవార్డుతో గౌరవిస్తారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+