బియ్యం సంచుల కోసం మత మార్పిళ్లు: కొత్త జేఎన్‌యూ వీసీ ధూళిపూడి పాత ట్వీట్ల కలకలం
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం కొత్త వైస్ ఛాన్సలర్‌గా నియమితులైన ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్.. విమర్శలకు కేంద్రబిందువు అయ్యారు. ముస్లిం వ్యతిరేకంగా, హిందుత్వవాదిగా అభివర్ణిస్తోన్నారు. దీనికి సాక్ష్యంగా ఇదివరకు ఆమె చేసిన పాత ట్వీట్లను నెటిజన్లు తవ్వి తీశారు. వాటి స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోన్నారు. ఆమె నియామకాన్ని భారతీయ జనతా పార్టీకే చెందిన లోక్‌సభ సభ్యుడు వరుణ్ గాంధీ సైతం తప్పు పట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

శాంతిశ్రీ ధూళిపూడి అపాయింట్..
జేఎన్‌యూ వైస్ ఛాన్సలర్‌గా ఇటీవలే శాంతిశ్రీ ధూళిపూడి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు వీసీగా పనిచేసిన ఎం జగదీష్ కుమార్.. యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ ఛైర్మన్‌గా అపాయింట్ అయ్యారు. ఆయన ఖాళీ చేసిన స్థానాన్ని ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌తో భర్తీ చేసింది కేంద్ర ప్రభుత్వం. బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి అయిదు సంవత్సరాల పాటు ఆమె ఈ హోదాలో కొనసాగుతారు.

తెలుగు మూలాలు..
జేఎన్‌యూ వీసీగా నియమితురాలైన తొలి మహిళ ఆమే. రష్యాలో జన్మించారు. చెన్నైలో చదువుకున్నారు. తెలుగు మూలాలున్న కుటుంబం ఆమెది. తెలుగు సహా ఆరు భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. తమిళం, మరాఠీ, హిందీ, సంస్కృతం, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం ఉంది. కన్నడ, మలయాళం, కొంకణి భాషలపైనా పట్టు ఉంది. మహారాష్ట్రలోని సావిత్రిభాయి పులే యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గా పనిచేశారు. జేఎన్‌యూ పూర్వ విద్యార్థిని. ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేశారు.

పాత ట్వీట్ల దుమారం..
కాగా- ఇదివరకు ఆమె చేసిన ట్వీట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత్రి సోనియాగాంధీని విదేశీ వనితగా విమర్శిస్తూ గతంలో శాంతిశ్రీ ట్వీట్ల చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటాలియన్ రిమోట్ కంట్రోల్‌గా సోనియాగాంధీని విమర్శించారు. దేశంలో లవ్ జిహాద్ పెచ్చరిల్లిందని, ఉగ్రవాదం కంటే ఇది అత్యంత ప్రమాదకరమైనదని, ముస్లిమేతరులు మేల్కొవాలంటూ ఆమె ఇదివరకు ట్వీట్లు చేశారు. జేఎన్‌యూతో పాటు జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీ, సెయింట్ స్టెఫాన్ కళాశాలలను టార్గెట్‌గా చేసుకుని సోషల్ మీడియాలో పలు కామెంట్స్ పోస్ట్ చేశారు.
బియ్యం సంచుల కోసం
బియ్యం సంచుల కోసం మత మార్పడికి కొందరు అంగీకరిస్తున్నారంటూ శాంతిశ్రీ ధూళిపూడి వివాదాస్పదమైన ట్వీట్లను చేశారని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే విమర్శించారు. అలాంటి అన్యమత ధ్వేషిని ఓ అత్యున్నత యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా నియమించడం సరికాదని అన్నారు. జేఎన్‌యూలో చదువుకునే హిందూయేతర విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండొచ్చో ఊహించుకోవచ్చని చెప్పారు. తమిళ నటుడు, మక్కల్ నీథి మయ్యం అధినేత కమల్ హాసన్‌ను విమర్శిస్తూ శాంతిశ్రీ ట్వీట్లు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రెస్‌నోట్‌లో గ్రామర్ మిస్టేక్స్..
తనను జేఎన్‌యూ వైస్ ఛాన్సలర్‌గా నియమించడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ శాంతిశ్రీ ధూళిపూడి విడుదల చేసిన మొట్టమొదటి ప్రెస్ నోట్‌పై వరుణ్ గాంధీ విరుచుకుపడ్డారు. అందులో అన్నీ తప్పులే ఉన్నాయని విమర్శించారు. ఇంగ్లీష్ గ్రామర్ కూడా రాని వారిని అత్యున్నత యూనివర్శిటీలో అంతే అత్యున్నత స్థానంలో నియమించారని అన్నారు. ఆమె విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లోని తప్పులను ఎత్తి చూపుతూ ఓ ట్వీట్ చేశారు వరుణ్ గాంధీ. ఇలాంటి వారిని నియమించడం పట్ల యువత భవిష్యత్ నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications