వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు: బీజేపీదే గెలుపు, కానీ సీట్లు తగ్గుతాయి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం ఎన్నికలు గత నెల నవంబర్ నెలలో ముగిసాయి. తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7వ తేదీన (నేడు) ముగిశాయి. ఎన్నికలు ముగియగానే వివిధ మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేశాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ గెలుస్తుందని పలు సర్వేల్లో తేలింది.

ప్రీపోల్స్, ఎగ్జిట్ పోల్స్ పై ఎందుకంత ఆసక్తి?.. అవి ఎలా నిర్వహిస్తారు ప్రీపోల్స్, ఎగ్జిట్ పోల్స్ పై ఎందుకంత ఆసక్తి?.. అవి ఎలా నిర్వహిస్తారు

ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు

ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు

  • బీజేపీకి 102 నుంచి 120 సీట్లు
  • మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి 104 నుంచి 122 సీట్లు
  • బీఎస్పీకి 1-3 సీట్లు, ఇతరులకు 3-8 సీట్లు వస్తాయని తేలింది.
  • టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ ఫలితాలు

    టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ ఫలితాలు

    • బీజేపీకి 126 నుంచి కాంగ్రెస్ పార్టీకి 89, బీఎస్పీకి 6 సీట్లు
    • ఇతరులకు 9 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది.
    • ఆజ్ తక్ సర్వే ప్రకారం

      ఆజ్ తక్ సర్వే ప్రకారం

      • బీజేపీకి 102 నుంచి 120 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 104 నుంచి 122 సీట్లు
      • బీఎస్పీకి సున్నా సీట్లు, ఇతరులకు 4-11 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది.
      • మధ్యప్రదేశ్‌

        మధ్యప్రదేశ్‌

        మధ్యప్రదేశ్‌లో చంబల్ ప్రాంతంలో 31 సీట్లు ఉండగా 21 కాంగ్రెస్‌కు, 9 బీజేపీకి రానున్నాయి. గత ఎన్నికల కంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 9 సీట్లు పెరగనుండగా, బీజేపీకి 8 సీట్లు తగ్గనున్నాయి. 47 నియోజకవర్గాలు ఉన్న మహాకౌశల్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి 27 సీట్లు రానున్నాయి. బీజేపీకి 18 సీట్లు రానున్నాయి. గత ఎన్నికల కంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 13 ప్లస్ కాగా, బీజేపీకి 15 సీట్లు తగ్గనున్నాయి. నిమార్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు రానున్నాయి. బీజేపీకి 12 సీట్లు రానున్నాయి. గత ఎన్నికల కంటే కాంగ్రెస్‌కు ఓ సీటు తగ్గే అవకాశముండగా, బీజేపీకి గతంలో వచ్చిన సీట్లు రానున్నాయి. వింధ్య ప్రాంతంలో 30 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీకి 17 సీట్లు, బీజేపీకి 13 సీట్లు రానున్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌కు 5, బీజేపీకి 3 సీట్లు తగ్గనున్నాయి. మొత్తం ఓట్ షేర్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి 38 శాతం, బీజేపీకి 43 శాతం రానున్నాయి. ఇతరులకు 19 శాతం రానున్నాయి.

English summary
The BJP is likely to continue its winning streak in MP and Shivraj Singh Chouhan is expected to retain the CM post for the fourth consecutive term. According to Times Now-CNX Exit Poll, the BJP is expected to grab 126 seats, Congress 89, BSP – 06, Others – 09. In Madhya Pradesh Assembly Elections 2013, the BJP had won 165 seats, Congress – 58, BSP – 04, Others – 03.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X