వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈవీఎంలలో రిగ్గింగ్... కర్ణాటక ముఖ్యమంత్రి

|
Google Oneindia TeluguNews

ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో రాష్ట్ర్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల అంచనాలు తలకిందులయ్యాయి. అధికారంలో ఉన్నాము కదా ప్రజలు మాకే పట్టం కడతారనే అంచనాలను ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు ఆయా పార్టీలకు చేదు అనుభవాన్నిమిగిల్చాయి.దీంతో ప్రకటించిన ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను వారు జీర్ణీంచుకోలేక పోతున్నారు. ఈనేపథ్యంలోనే ఈవీఎంలపై వారి నెపం నెట్టివేస్తున్నారు.

ఈవీఎంలపై చంద్రబాబు పోరు...

ఈవీఎంలపై చంద్రబాబు పోరు...

ఇప్పటివరకు ఏపి సీఎం చంద్రబాబు నాయుడు ఈవీఎంలపై పెద్ద పోరాటమే చేస్తున్నాడు. 23 పార్టీల కూటమీతో కలిసి కోర్టుకు సైతం వెళ్లారు. వాటిలో లోపాలు ఉన్నాయంటూ వీపరీత ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ కోవలోనే కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామీ సైతం చేరారు. ఏపార్టీకి వేసిన బీజేపీకి ఓట్లు పడేట్టు వాటీని టాంపరింగ్ చేశారని ఆయన ఆరోపించారు.కాగా వీవీ ప్యాట్ స్లిప్‌లను 50 శాతం లెక్కించాలని 23 పార్టీల కూటమీ సుప్రిం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే ..దీంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐయిదు పోలింగ్ బూతుల ఈవీఎంలతో వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించాలని సుప్రిం కోర్టు ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో పలు చోట్ల ఎన్నికలు ఫలితాలు అయిదారు గంటలు ఆలస్యం అయ్యో అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోంది, కర్ణాటక ముఖ్యమంత్రి

ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోంది, కర్ణాటక ముఖ్యమంత్రి

ఈనేపథ్యంలోనే దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని ,నరేంద్రమోడీ అధ్యర్యంతో ఈవిఎంలలో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపణలు చేశారు. దీంతోపాటు అభివృద్ది చెందిన చాల దేశాల్లో బ్యాలెట్ పేపర్ ద్వార ఎన్నికలు నిర్వహిస్తున్నారని అయన తెలిపారు.కాగా ఆదివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ కొంతమంది నాయకులను టార్గెట్ చేస్తూ ఫలితాలు వెలువడ్డాయని,దీంతో ఫాల్స్ ఇంప్రెషన్‌ను ప్రజలకు కల్గిస్తున్నాయని తెలిపారు. ఎగ్జిట్‌పోల్స్ కాని ఎగ్సాక్ట్ రిజల్టు కాదని ఆయన ట్విట్టర్‌లో పేర్కోన్నారు.

కర్ణాటకలో చిత్తయిన కాంగ్రెస్ జేడిఎస్ అలయెన్స్

కర్ణాటకలో చిత్తయిన కాంగ్రెస్ జేడిఎస్ అలయెన్స్

కర్ణాటక రాష్ట్ర్రంలో అధికార జేడిఏస్ కూడ చిత్తుగా ఓడిపోనుట్టు ఎగ్జిట్‌పోల్ ఫలితాలు వెలువడ్డాయి.. జేడిఎస్ అధికారంలో ఉన్న ఆ పార్టీని ప్రజలు ఆధరించలేదని తెలుస్తోంది. దీంతో అధికార జేడిఎస్‌తో జతకట్టిన కాంగ్రెస్ పార్టీని సైతం ప్రజలు వ్యతిరేకించారు. గత సంవత్సరమే అధికారంలో వచ్చిన జేడిఎస్‌ను కాదని బీజేపీకి పట్టం కట్టారు. ఈనేపథ్యంలోనే 2014లో బీజేపీకి 17 సీట్లను కైవసం చేసుకోగ 2019 ఎన్నికల్లో కూడ 21 నుండి 25 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉన్నట్టు ఫలితాలు ప్రకటించించాయి. ఇక కాంగ్రెస్ ,జేడిఎస్ పార్టీలకు 3 నుండి 6 స్థానాలు కైవసం చేసుకోనుంది.

English summary
Karnataka Chief Minister H D Kumaraswamy reiterates the claim by Opposition about rigged EVMs. He said that the entire Opposition political parties had expressed concern over the credibility of EVMs under Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X