Exit Poll of Polls: ఢిల్లీలో హోరాహోరీ పోరు-ఆ పార్టీకే ఎడ్జ్-తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్ ..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఇవాళ సాయంత్రం నుంచి ప్రకటిస్తున్న ఎగ్జిట్ పోల్స్ దాదాపు ఒకే విధమైన అభిప్రాయాన్ని వెల్లడించాయి. ఢిల్లీ ఎన్నికల్లో అధికార ఆప్, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేశాయి. అలాగే ఇంత గట్టి పోటీలో ఓటర్లు ఎవరికి ఎడ్జ్ ఇచ్చారన్న అంశంపైనా దాదాపు మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఒకే విధమైన అభిప్రాయాన్ని పంచుకున్నాయి.

ఢిల్లీ ఎన్నికలపై ఇవాళ వెలువడిన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి ఆధిక్యాన్ని కట్టబెట్టాయి. అధికార ఆప్ కు రెండో స్ధానం మాత్రమే ఇచ్చాయి. అయితే మరికొన్ని పోల్స్ మాత్రం ఆప్ మళ్లీ గెలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్ విషయంలో మాత్రం అయితే గరిష్టంగా సున్నా నుంచి 3 సీట్లు లభిస్తాయని దాదాపుగా అన్ని సంస్థలు తేల్చిచెప్పేశాయి. దీంతో ఢిల్లీ ఎన్నికల్లో అసలు పోరు బీజేపీ, ఆప్ మధ్యే జరిగిందని తెలుస్తోంది.
ఇవాళ వెలువడిన ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే మ్యాట్రిజ్ బీజేపీకి 35-40, ఆప్ కు 32-37 సీట్లు, కాంగ్రెస్ కు 0-1 సీట్లు ఇచ్చింది. అలాగే పీపుల్స్ పల్స్ బీజేపీకి 51-60 సీట్లు, ఆప్ కు 10-19 సీట్లు ఇచ్చింది. పీమార్క్ ఎగ్జిట్ పోల్ బీజేపీకి 39-49 సీట్లు, ఆప్ కు 21-31 సీట్లు, కాంగ్రెస్ కు 0-1 సీట్లు ఇచ్చింది. అలాగే జేవీసీ తమ పోల్ లో బీజేపీకి 39-45 సీట్లు ఇవ్వగా.. ఆప్ కు 22-31, కాంగ్రెస్ కు 0-2 సీట్లు ఇచ్చింది.
పీపుల్స్ ఇన్ సైట్ బీజేపీకి 40-44 సీట్లు, ఆప్ కు 25-29 సీట్లు, కాంగ్రెస్ కు ఒక్క సీటు ఇచ్చింది. చాణక్య స్ట్రాటజీస్ బీజేపీకి 39-44 సీట్లు, ఆప్ కు 25-28 సీట్లు, కాంగ్రెస్ కు 2-3 సీట్లు ఇచ్చింది. పోల్ డైరీ బీజేపీకి 42-50 సీట్లు, ఆప్ కు 18-25 సీట్లు, కాంగ్రెస్ కు 0-2 సీట్లు ఇచ్చింది. డీవీ రీసెర్చ్ బీజేపీకి 36-44 సీట్లు, ఆప్ కు 26-34 సీట్లు ఇచ్చింది. వీప్రెసైడ్ తమ సర్వేలో ఆప్ కు 46-52 సీట్లు, బీజేపీకి 18-23 సీట్లు, కాంగ్రెస్ కు 0-1 సీట్లు ఇచ్చింది. జీనియా తమ సర్వేలో ఆప్ కు 33-38 సీట్లు, బీజేపీకి 31-36 సీట్లు ఇచ్చింది.
ప్రాంతీయ సంస్ధల సర్వేల్ని చూస్తే కేకే సర్వే ఎగ్జిట్ పోల్ ప్రకారం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ ఈసారి 44 సీట్లు సాధించబోతున్నట్లు అంచనా వేశారు. అలాగే విపక్ష బీజేపీకి మాత్రం 26 సీట్లకు పరిమితం అవుతుందని తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కడం లేదని తేల్చేశారు. హైదరాబాద్ కు చెందిన మరో సంస్ధ ఆబ్సల్యూట్ పొలిటికో మాత్రం ఢిల్లీ ఎన్నికల్లో అసెంబ్లీలోని 70 సీట్లలో బీజేపీకి ఏకంగా 43-52 సీట్లు దగ్గబోతున్నట్లు తెలిపింది. అధికార ఆప్ కు కేవలం 15-27 సీట్లు మాత్రమే లభించబోతున్నట్లు ఎగ్జిట్ పోల్ తేల్చింది. అటు కాంగ్రెస్ కు 0-2 సీట్లు దక్కవచ్చని తెలిపింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications