Himachal Pradesh India TV-Matrize: చివరి బంతికి వరకు ఉత్కంఠతే..!!
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడుతున్నాయి. కిందటి నెల 12వ తేదీన ఒకే దశలో ముగిసిన ఎన్నికలు ఇవి. 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇవ్వాళ పోలింగ్‌ను ముగించుకున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి ఓట్లను లెక్కించనున్నారు ఎన్నికల అధికారులు. గుజరాత్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్‌లో కూడా భారతీయ జనత పార్టీ అధికారంలో ఉండటం వల్ల ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టీ నిలిచింది.
హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 68. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 35. ఈ సంఖ్యను అందుకోవడానికి బీజేపీ కష్టపడక తప్పదనే అంచనాలు వెలువడుతున్నాయి. దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఆజ్‌తక్-యాక్సిస్ మై ఇండియా, ఇండియా టీవీ-మ్యాట్రిజ్, న్యూస్ ఎక్స్-జన్ కీ బాత్, రిపబ్లిక్ టీవీ-పీ మార్క్ వంటివన్నీ టఫ్ ఫైట్‌నే సూచిస్తోన్నాయి.

ఇండియా టీవ-మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం- హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీకి 35 నుంచి 40 అసెంబ్లీ స్థానాలు లభించే అవకాశం ఉంది. కాంగ్రెస్ 28 నుంచి 33 సీట్లను కైవసం చేసుకుంటుందని తెలిపింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటు గెలవడానికి నానా తంటాలు పడాల్సి రావొచ్చని పేర్కొందీ ఎగ్జిట్ పోల్ రిజల్ట్. ఇతరులు నాలుగు స్థానాల వరకు దక్కించుకోగలరని పేర్కొంది. దాదాపుగా హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చనే సంకేతాలను పంపించింది. బీజేపీ గెలిచినా బొటాబొటీ మెజారిటీ ఉంటుందని తెలిపింది.
వరుసగా రెండోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమా హిమాచల్ ప్రదేశ్ బీజేపీ శ్రేణుల్లో వ్యక్తమౌతోన్నప్పటికీ.. ఎగ్జిట్ పోల్స్‌తో ఉలిక్కిపడుతున్నారు. వారి ధీమా, అంచనాలకు అనుగుణంగా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఉండట్లేదు. బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోరు ఉండబోతోందని అంచనా వేస్తోన్నాయి. చిట్టచివరి వరకు ఉత్కంఠభరితంగా హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఉండబోతోన్నాయనేది తేల్చి చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications