వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎగ్జిట్ పోల్ అంచనాల్లో భారీ అంతరం.. ఆ మూడు రాష్ట్రాల లెక్కలపై అయోమయం

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : కేంద్రంలో ఎన్డీఏ కూటమి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. 272సీట్లు సాధించడం కూటమికి నల్లేరుమీద నడకేనని అంటున్నాయి. అయితే కీలకమైన మూడు రాష్ట్రాల విషయంలో వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ అంచనాల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్, బెంగాల్, ఒడిశాల్లో కలిపి 143 లోక్‌సభ స్థానాలుండగా.. అక్కడ ఏ కూటమికి ఎన్ని సీట్లు గెల్చుకుంటున్న విషయంలో ఒక్కో సంస్థ అంచనా ఒక్కోరకంగా ఉంది.

ఈశాన్యంలో కమల వికాసం... అసోంలో మెజార్టీ స్థానాలు బీజేపీవేనంటున్న ఎగ్జిట్ పోల్స్ఈశాన్యంలో కమల వికాసం... అసోంలో మెజార్టీ స్థానాలు బీజేపీవేనంటున్న ఎగ్జిట్ పోల్స్

యూపీలో కూటమి విజయంపై భిన్నస్వరాలు

యూపీలో కూటమి విజయంపై భిన్నస్వరాలు

కేంద్రంలో అధికారం చేపట్టేందుకు దగ్గరి దారిగా భావించే ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు 73సీట్లు గెల్చుకుని విజయ దుందుభి మోగించింది. అయితే ఈసారి బీజేపీ గానీ, ఎస్పీ -బీఎస్పీ - ఆర్ఎల్డీ కూటమిగానీ గెల్చుకునే స్థానాలపై వివిధ సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్ అంచనాల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. రిపబ్లిక్ టీవీ సీ ఓటర్ సర్వే ప్రకారం యూపీలో మహాకూటమి 40స్థానాలు ఖాతాలో వేసుకోనుండగా.. బీజేపీ బలం సగానికి తగ్గి 38కి పరిమితమవుతుందని, కాంగ్రెస్ 2సీట్లలో గెలుస్తుందని చెప్పింది. ఏబీపీ న్యూస్ సైతం కూటమి పార్టీలకు 56సీట్లలో విజయం తధ్యమని చెప్పింది కానీ మిగతా సర్వేలు మాత్రం యూపీలో బీజేపీ మరోసారి సత్తా చాటుతుందని చెబుతున్నాయి.

బెంగాల్‌లో ఢీ అంటే ఢీ

బెంగాల్‌లో ఢీ అంటే ఢీ

బెంగాల్‌‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ దీదీ కోటకు బీటలు వార్చడం ఖాయమని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. 42 సీట్లున్న బెంగాల్‌లో తృణమూల్ 19-22, బీజేపీ 19-23 స్థానాలు గెల్చుకుంటాయని ఆజ్ తక్ అంచనా వేసింది. అయితే మిగతా సర్వేలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. టుడేస్ చాణ్య అంచనా ప్రకారం తృణమూల్ 23 స్థానాల్లో గెలవనుండగా.. బీజేపీ 18సీట్లలో పాగా వేయనుంది. అయితే బీజేపీ అంత భారీ స్థాయిలో సీట్లు గెలుచుకోలేదని
టైమ్స్ నౌ వీఎంఆర్ అంచనా వేస్తోంది. బెంగాల్‌లో ఆ పార్టీకి 11 సీట్లు వస్తాయని, తృణమూల్ కాంగ్రెస్ 29స్థానాలను ఖాతాలో వేసుకోనున్నాయని అంటోంది.

బీజేపీదే హవా అంటున్న మెజార్టీ సర్వేలు

బీజేపీదే హవా అంటున్న మెజార్టీ సర్వేలు

టైమ్స్ నౌ - వీఎంఆర్ ఎగ్జిట్ పోల్ ప్రకారం యూపీలో బీజేపీ దాని మిత్రపక్షాలు 58స్థానాల్లో విజయం సాధించనున్నాయి. ఎస్పీ - బీఎస్పీ -ఆర్ఎల్డీ కూటమి కేవలం 20స్థానాలకు పరిమితం కానున్నాయి. టుడేస్ చాణ్య అంచనాల ప్రకారం మహాకూటమి 13, బీజేపీ 65స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయనుంది. ఇక ఆజ్‌తక్ - యాక్సిస్ మై ఇండియా డేటా ప్రకారం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్డీయే 62 నుంచి 68స్థానాల్లో పాగా వేయనుంది. వీటిలో ఏ ఒక్క సంస్థ కూడా కాంగ్రెస్‌కు రెండుకు మించి సీట్లు వస్తాయని చెప్పకపోవడం విశేషం.

ఒడిశా లెక్కలో భారీ తేడా

ఒడిశా లెక్కలో భారీ తేడా

21 లోక్‌సభ సీట్లున్న ఒడిశాలో కూడా ఎగ్జిట్ పోల్ అంచనాలు జనాన్ని అయోమయానికి గురిచేశాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెల్చుకున్న బీజేపీ ఈసారి బీజేడీతో సమానంగా సీట్లు కైవసం చేసుకుంటాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. 2014లో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ 20స్థానాలు తన ఖాతాలో వేసుకోగా.. ఆజ్ తక్ సర్వే ప్రకారం ఈసారి ఆ పార్టీకి ఒక్క సీటు సాధించే అవకాశమేలేదని, బీజేపీ 15 నుంచి 19స్థానాలు ఎగురేసుకుపోవడం ఖాయమంటోంది. టైమ్స్ నౌ వీఎంఆర్, రిపబ్లిక్ టీవీ సీ ఓటర్ మాత్రం బీజేపీ 10 నుంచి 12, బీజేపీ 8 నుంచి 11 సీట్లు గెలుచుకుంటాయని చెబుతున్నాయి. న్యూస్ 24, టుడేస్ చాణక్య అంచనా ప్రకారం కమలదళం 14స్థానాల్లో దూసుకుపోనుండగా.. నవీన్ పట్నాయక్ పార్టీ కేవలం 7 సీట్లకు పరిమితం కానుంది.

English summary
Most of the exit polls project that the NDA will comfortably cross the magic mark of 272 seats to form the government, the projections widely vary with regard to the BJP’s performance in three key states Uttar Pradesh, West Bengal and Odisha which account for 143 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X