వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామా చేసేది లేదు: జయలలితకు శశికళ ధిక్కారం

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప మరోసారి ధిక్కార స్వరం వినిపించారు. కొద్ది రోజుల క్రితం శశికళ పుష్ప డిఎంకె ఎంపీని ఢిల్లీ విమానాశ్రయంలో చెంపదెబ్బ కొట్టారు. దీంతో ఆమెను జయలలిత పార్టీ నుంచి బహిష్కరించారు. అనంతరం ఆమె జయలలిత పైన సభలోనే మండిపడ్డారు.

ఈ అంశంలో ఇటీవల కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. శశికళ పుష్ప పైన లైంగిక వేధింపుల కేసు నమోదయింది. దీంతో ఆమె రాజ్యసభకు రాజీనామా చేయాలనే డిమాండ్ వచ్చింది. దీనిపై శశికళ పుష్ప మాట్లాడుతూ.. తాను రాజ్యసభకు రాజీనామా చేసే ప్రసక్తి లేదన్నారు.

శశికళను వదిలిపెట్టని జయలలిత!: రూ.20 తీసుకున్నారని ఫిర్యాదుశశికళను వదిలిపెట్టని జయలలిత!: రూ.20 తీసుకున్నారని ఫిర్యాదు

Expelled AIADMK MP Sasikala Pushpa says won't resign from Rajya Sabha

ఎంపీ శశికళ పుష్ప పైన, ఆమె కుటుంబ సభ్యుల పైన ఇద్దరు పని మనుషులు లైంగిక వేధింపులు, అసభ్య ఆరోపణల కేసు నమోదు చేశారు. అయితే జయలలితతో ధిక్కార స్వరం వినిపించినందునే కేసులు నమోదయ్యాయని మద్రాస్ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నారు.

రాజ్యసభకు రాజీనామా చేయాలని ఆమెకు జయలలిత అల్టిమేటం జారీ చేశారు. తాను మాత్రం రాజీనామా చేసే ప్రసక్తే లేదని శశికళ చెప్పారు. కాగా, లైంగిక వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ విషయమై సోమవారం ఆమె మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఎదుట హాజరై తన వాదనలు వినిపించారు.

English summary
Expelled AIADMK Rajya Sabha MP M Sasikala Pushpa, who is facing sexual harassment case filed by her two domestic aides, said on Monday that she would not resign from the Upper House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X