వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుబాటులోకి మరో వ్యాక్సిన్‌- రష్యన్‌ స్పుత్నిక్‌ వీ వాడకానికి నిపుణుల సిఫార్సు

|
Google Oneindia TeluguNews

రష్యా అభివృద్ది చేసిన స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ను భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నిపుణుల బృందం సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వ డ్రగ్‌ ప్రమాణాల నియంత్రణ సంస్ధ (సీడీఎస్‌సీవో)కు చెందిన సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ ఈ మేరకు కేంద్రానికి తమ సిపార్సు పంపింది. దీనిపై డీజీసీఐ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ప్రస్తుతం భారత్‌లో అత్యవసర వినియోగానికి కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌లను అనుమతించారు. ఇప్పుడు రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీని కూడా అనుమతిస్తే భారత్‌లో అనుమతించిన మూడో వ్యాక్సిన్ కానుంది. కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ రెండూ భారత్‌ తయారీ వ్యాక్సిన్లు కాగా.. స్పుత్నిక్‌ వీ మాత్రం రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్. డీజీసీఐ అనుమతి లభిస్తే దీన్ని రష్యా నుంచి భారత్‌కు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలోవ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో స్పుత్నిక్‌ వీకి కేంద్రం అనుమతిచ్చే విషయంలో ఉత్కంఠ నెలకొంది.

Expert panel recommends approval to covid vaccine sputnik v for emergency use in India

భారత్‌కు చెందిన రెడ్డీస్ ల్యాబ్స్‌ సహకారంతో రష్యాకు చెందిన రష్యన్ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ దీన్ని అభివృద్ధి చేసింది. గతేడాది సెప్టెంబర్లో తొలి విడత ప్రయోగాల కోసం స్పుత్నిక్ వీ డోసులు భారత్ చేరుకున్నాయి. ఇందులో ఈ రష్యన్‌ వ్యాక్సిన్‌ 91.6 శాతం సమర్ధవంతంగా పనిచేస్తందని తేలింది. 19, 866 వాలంటీర్లపై ఈ టీకాను ప్రయోగించగా ఈ ఫలితాలు వచ్చాయి. దీంతో భారత్‌లో అత్యవసర వాడకానికి తమకు అనుమతివ్వాలని రష్యా కోరుతోంది.

English summary
An expert panel of India’s Central drug authority has recommended granting approval to Russian COVID-19 vaccine Sputnik V for emergency use in the country with certain conditions, sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X