వ్యాక్సిన్ పాస్‌పోర్ట్స్: ట్రావెలర్స్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు... బెనిఫిట్స్ ఇవే...
కరోనా మహమ్మారి ప్రపంచంపై ఎంత ప్రతికూల ప్రభావాన్ని చూపిందో అందరికీ తెలిసిందే. కరోనా ముందు,కరోనా తర్వాత అని చర్చించుకునేంతలా కొన్ని రంగాలు ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగిపోయింది. ఇదివరకు టైమ్ దొరికితే చాలు వెకేషన్స్‌కు వెళ్లేవాళ్లు ఇప్పుడు కాస్త ఆచీ తూచీ వ్యవహరిస్తున్నారు. వెళ్లాలనుకుంటున్న డెస్టినేషన్‌లో కరోనా పరిస్థితులు,అక్కడ తీసుకుంటున్న జాగ్రత్తల గురించి తెలుసుకున్నాకే అడుగు ముందుకేస్తున్నారు. అటు చాలావరకు దేశాలు ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ పట్ల కచ్చితమైన ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు 'వ్యాక్సిన్ పాస్‌పోర్ట్స్' సరైన విధానమని ఐరాస వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్(UNWTO) భావిస్తోంది.

అసలేంటీ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్...
వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ అనేది ఒక డిజిటల్ డాక్యుమెంట్. ఒక వ్యక్తి కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్నాడనే దానికి కచ్చితమైన ప్రూఫ్ లాంటిది. కాబట్టి ఈ పాస్‌పోర్ట్‌తో విదేశాల్లోకి అడుగుపెట్టేవారికి ఎటువంటి అడ్డంకులు,ఆంక్షలు ఉండవు. నిజానికి ఈ విధానం ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో అమలులో ఉంది. ఆ దేశాలకు వెళ్లే ప్రయాణికులు ఎల్లో ఫీవర్‌కు ఇంజెక్షన్ తీసుకోవడం తప్పనిసరి. ఆ ఇంజెక్షన్ తీసుకున్నవారికే అక్కడ అడుగుపెట్టేందుకు అనుమతి ఉంటుంది. ఇదే తరహా విధానాన్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 నియంత్రణ కోసం అమలుచేయాలని ఐరాస వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్(UNWTO) భావిస్తోంది.

వీటితో బెనిఫిట్ ఏంటి...
వ్యాక్సిన్ పాస్‌పోర్ట్స్‌ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది. కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఆ దేశం గ్రీన్ పాస్‌పోర్ట్స్‌ను జారీ చేస్తోంది.టూరిజంపై ఎక్కువగా ఆధారపడే థాయిలాండ్ కూడా ఇప్పుడదే బాటలో పయనిస్తోంది. డెన్మార్క్,హంగేరీ,గ్రీస్ దేశాలు కూడా ఇప్పటికే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్స్(డిజిటల్), ఇమ్యూనిటీ పాస్‌పోర్ట్స్‌ను జారీ చేశాయి. ఈ పాస్‌పోర్ట్స్‌తో విదేశాలకు ట్రావెల్ చేసేవారికి టూరిజం,హోటల్స్‌కు సంబంధించి ఎక్కడా,ఎలాంటి అడ్డంకులు ఎదురుకావు. ముఖ్యంగా క్వారెంటైన్‌లో ఉండాల్సిన అవసరం ఉండదు. ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ 'వ్యాక్సిన్ పాస్‌పోర్ట్స్'తో అడుగుపెట్టడం ద్వారా విమానాశ్రయాల్లో కరోనా టెస్టులు నిర్వహించే భారం కూడా తప్పుతుంది. భారత్‌లో ఇప్పటికైతే 'వ్యాక్సిన్ పాస్‌పోర్ట్స్' అందుబాటులోకి రాలేదు. వ్యాక్సిన్ తీసుకున్నవారికి కేవలం క్యూఆర్ కోడ్‌తో కూడిన సర్టిఫికెట్ మాత్రమే అందిస్తున్నారు.

ప్రైవేట్ సంస్థలు కూడా...
పలు స్వచ్చంద సంస్థలు,ప్రైవేట్ టెక్నాలజీ కంపెనీలు కూడా ఈ తరహా డిజిటల్ డాక్యుమెంట్స్/పాస్‌పోర్ట్స్‌ను రూపొందిస్తున్నాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్,పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో 'కామన్ పాస్' అనే డిజిటల్ డాక్యుమెంట్‌ను తీసుకొచ్చే పనిలో నిమగ్నమైంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్(IATA) 'ట్రావెల్ పాస్'ను రూపొందిస్తోంది. ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ 'ఏఓకె పాస్'ను తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications