ట్రంప్ కు మోడీ బిగ్ షాక్..! కీలక సమయంలో హ్యాండ్ ?
అమెరికాలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ పై ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్.. అవకాశం దొరికినప్పుడల్లా పగ తీర్చుకుంటున్నారు. తాజాగా రష్యా చమురు కొంటున్నామనే కారణం చూపుతూ భారత్ పై ఏకంగా 50 శాతం అదనపు సుంకాలు బాదేసిన ట్రంప్.. ఇప్పటికీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం లేదు. పైకి మాత్రం ప్రధాని మోడీకి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం తాను చేయాలనుకుందే చేస్తున్నారు. దీంతో ఇవాళ మోడీ ట్రంప్ కు షాకిచ్చారు.
ఇప్పటికే పాకిస్తాన్ తో భారత్ కు కాల్పుల విరమణ చేయించిందని తానేనని పదే పదే చెప్పుకుంటున్న ట్రంప్ కు అదేం లేదంటూ మోడీ తేల్చేయడం మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ఈజిప్ట్ లో ఇజ్రాయెల్-పాలస్తీనా శాంతి ఒప్పందం కోసం ట్రంప్ తో పాటు 20 దేశాల నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి భారత ప్రధాని మోడీని నిన్న చివరి నిమిషంలో ఆహ్వానించారు. ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి మోడీని పిలిచారు. అయితే మోడీ మాత్రం ఈ భేటీకి దూరంగా ఉన్నారు.

అధికారికంగా మాత్రం కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. దీని వెనుక ఓ కీలక కారణం కనిపిస్తోంది. ఈజిప్ట్ లోని షర్మ్ ఎల్ షేక్ లో హమాస్ కూ, ఇజ్రాయెల్ కూ మధ్య జరుగుతున్న శాంతి ఒప్పందానికి సాక్ష్యులుగా 20కి పైగా దేశాధినేతల్ని ఆహ్వానించారు. ఇందులో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ సదస్సుకు మోడీ హాజరైతే అక్కడ కచ్చితంగా ఆయనతో కలిసి వేదికపై కూర్చోవాల్సి వస్తుంది. పహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్ తో కలిసి ఏ పని చేసేందుకు కూడా సిద్దంగా లేని మోడీ.. ఈ సదస్సుకు కూడా హాజరు కాలేదని తెలుస్తోంది.

అలాగే ప్రధాని ఈజిప్ట్ వెళ్లకపోవడానికి మరో కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సదస్సుకు నేతృత్వం వహిస్తున్న ట్రంప్.. అక్కడ కూడా భారత్-పాక్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం తానే చేశానని చెప్పుకునే అవకాశం ఉంది. దీన్ని మోడీ అక్కడ ఖండిస్తే ఇబ్బందులు తప్పవు. అలాగని అంతవరకూ వెళ్లి ఖండించకుండా ట్రంప్ చెప్పింది విని వచ్చేస్తే స్వదేశంలో విమర్శలు తప్పవు. అందుకే ఈజిప్ట్ భేటీకి మోడీ వెళ్లకపోయి ఉండొచ్చని సమాచారం.












Click it and Unblock the Notifications